Raja Saab | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి మారుతి డైరెక్షన్లో నటిస్తోన్న రాజాసాబ్ (raja saab). హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
కాగా తెలుగులో తొలి సినిమానే ప్రభాస్‌తో చేయడం పట్ల చాలా ఎక్జయిటింగ్‌కు లోనవుతోంది మాళవిక. తాజాగా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో రాజాసాబ్ గురించి ఆసక్తికర వార్త షేర్ చేసి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇది నా తెలుగు డెబ్యూ సినిమా. అంతేకాదు ఇది నా ఫేవరేట్ హీరో ప్రభాస్ సినిమా. రాజాసాబ్ అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని చెప్పింది.
తాజా టాక్ ప్రకారం రాజాసాబ్‌లో ఓ పాట పెండింగ్‌లో ఉండగా.. 2024 ముగిసే లోపు ఇటలీలో షూట్ పూర్తి చేయనున్నారట. మొత్తానికి రాజాసాబ్ ఈ ఏడాది ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాడన్నమాట.
మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ సరికొత్తగా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. రాజాసాబ్‌లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
#TheRajaSaab shooting is almost over, and it’s coming out really well. #Prabhas is one of my favorite heroes.
– #MalavikaMohanan pic.twitter.com/mvCcDSorlY
— Suresh PRO (@SureshPRO_) November 30, 2024
Sandeham | ఓటీటీలో హెబ్బా పటేల్ ఫీవర్.. ట్రెండింగ్‌లో సందేహం
Trisha | గెట్ రెడీ.. డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న త్రిష
Bloody Beggar | బ్లడీ బెగ్గర్ ఓటీటీలోకి వచ్చేశాడు.. కవిన్ సందడి చేసే పాపులర్ ప్లాట్‌ఫాం ఇదే