Ram Gopal Varma | ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో నమోదైన కేసు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన వ్యవహారంలో వర్మపై నమోదు కాగా.. విచారణకు హాజరుకాకపోవడంతో వర్మ మిస్సింగ్.. వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నట్టు ఇప్పటికే కథనాలు వచ్చాయి.
అయితే ఈ కథనాలపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు వర్మ. నేను ఏదో పరారీలో ఉన్నాను.. ఇంకా పోలీసులు నా కోసం మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ .. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసులోనే ఉన్నాను. అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప. మీడియా ఎప్పటిలాగానే హైడ్రామా క్రియేట్ చేసింది. నేనెక్కడికీ పారిపోలేదు. చట్టాన్ని గౌరవిస్తా.
ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసులోకి కాలే పెట్టలేదు. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసు లోకి ఎందుకు రారు? అంటూ మీడియాలో వస్తున్న కథనాలకు చెక్ పెడుతూ తనదైన శైలిలో సుదీర్ఘ సందేశాన్ని ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ.. పలు ఛానళ్లను ట్యాగ్ చేశాడు వర్మ. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా ఇప్పటికే ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. నాకొక నోటీస్ వచ్చింది.. నేను ఫలానా తారీఖు వస్తానని రిప్లై ఇచ్చా. షూటింగ్ వర్క్ కొనసాగుతుండటంతో నిర్మాతకు నష్టం రావొద్దని నేను మళ్లీ టైం అడిగా. ఈ కేసు ఏమైనా ఎమర్జెన్సీ కేసా ఏమైనా.. ఏడాది తర్వాత ట్వీట్ చూసిన అతనికి వారంలో అన్నీ అయిపోవాలనడంలో ఏమైనా అర్థం ఉంటదా అసలు.. హత్యకేసుల్లాంటి వాటికి సంవత్సరాలు తీసుకొని.. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసుల కంటే ముందే వీటిని విచారించడమేంటని తనదైన శైలిలో కౌంటర్ వేశాడని తెలిసిందే. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
నా కేసు —- RGV @ndtv @IndiaToday @TimesNow @republic @TV9Telugu @NtvTeluguLive @sakshinews @tv5newsnow @BBCWorld @DDNewslive @ZeeNews
1.
నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ…
— Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2024
THE PARADISE | నానితో కలెక్షన్ కింగ్ ఫైట్.. శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ క్రేజీ న్యూస్..!
Kiran Abbavaram | ఓటీటీలో కిరణ్ అబ్బవరం క చాలా స్పెషల్.. ఎందుకంటే..?
Jailer 2 | తలైవా బర్త్ డే స్పెషల్.. జైలర్ 2 షూటింగ్ షురూ అయ్యే టైం ఫిక్స్