Anchor Rashmi | బుల్లితెరపై తన అందం, చురుకైన మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. టెలివిజన్ షోలతో పాటు నెట్టింట కూడా తన అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడిస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై రష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం చేస్తే సహించబోనని గట్టిగా హెచ్చరించింది. రష్మీ ప్రస్తుతం బుల్లితెరపై పలు ఎంటర్టైన్మెంట్ షోలతో బిజీగా ఉంటుంది. ముఖ్యంగా కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. తరచూ సామాజిక అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం గురించి కూడా ఆమె ఆసక్తికరమైన ట్వీట్ చేయడంతో అది వైరల్ అయింది.
ఇలాంటి సమయంలోనే ఒక నెటిజన్ రష్మీ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమె వ్యక్తిగత సంబంధాల గురించి విమర్శలు చేయడంతో రష్మీ ఆ పోస్ట్‌పై ఘాటుగా స్పందించింది. ముందుగా తాను చెప్పిన విషయాలకు రుజువులు చూపించాలని సవాల్ విసిరింది. ముందుగా ప్రూఫ్ చూపించండి. రెండవది, నాకు ఎన్ని సంబంధాలు ఉన్నా లేకపోయినా నన్ను వేధింపులకి గురి చేసే హక్కు ఎవరికీ లేదు. నేను మిమ్మల్ని, మీ తండ్రిని లేదా మీ కొడుకును పెళ్లి చేసుకునే వరకు నేను ఎవరి తో తిరిగినా అది మీ సమస్య కాదు” అంటూ రష్మీ ఘాటుగా స్పందించింది.
అంతేకాకుండా తన పేరు చెడగొట్టేలా ఆరోపణలు చేయాలంటే ప్రూఫ్‌తో చెప్పాలని కూడా ఆమె డిమాండ్ చేసింది. “నాకు ఎవరితో లింక్ ఉందో ప్రూఫ్‌తో సహా పేర్లు చెప్పండి. నా పేరు మాత్రమే చెప్పడం ఎందుకు? ఎవరినైనా క్యారెక్టర్ హత్య చేయాలనుకుంటే ఇద్దరి పేర్లు బయటపెట్టండి, అది న్యాయం” అంటూ ఆ నెటిజన్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే రష్మీపై ఇలా ట్రోలింగ్ జరగడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్‌కు రష్మీ పలుమార్లు ధైర్యంగా స్పందించి ట్రోలర్లకు గట్టి సమాధానాలు ఇచ్చింది.