Ram Gopal Varma | ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన వ్యవహారంలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో వర్మ కోసం గాలిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
కాగా ఈ కేసులో వర్మ వేసిన ముందస్తు పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో వర్మ షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో వర్మ మాట్లాడుతూ.. నేను వణికిపోతున్నా.. మంచం కింద కూర్చొని ఏడుస్తున్నానంటూ పుకార్లు సృష్టిస్తున్న కొందరు మీడియా వాళ్లకు ఈ వీడియో నిరాశ కలిగించవచ్చు. క్షమించండి. నేను ఏడాది కింద ఏదో ట్వీట్ పెట్టానని నాపై ఆరోపణలున్నాయి. ఆ ట్వీట్స్‌తో ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. విచిత్రమేంటంటే.. ఏడాది కింద పెట్టిన ట్వీట్స్ నాలుగు భిన్నమైన ప్రాంతాల్లో నలుగురు వ్యక్తులకు మూడునాలుగు రోజుల వ్యవధిలో ఒకేసారి వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో ఫిర్యాదు చేసి కేసులు పెట్టడం జరిగింది.
ఎవరిమీద పెట్టానో వాళ్లకు సంబంధం లేకుండా ఎవరో థర్డ్ పార్టీ కేసు పెడితే.. ఈ కేసు సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది నా అనుమానం. విచారణ చేయడానికి పద్దతి ప్రకారం ఉన్న చట్టాలను వాడుతున్నారా..? పొలిటికల్ పార్టీలు వ్యవస్థలోని పోలీసులను ఆయుధాలుగా వాడుతున్నారా..? అని ప్రశ్నించిన వర్మ.. తాను ఏ ఒక్క రాజకీయ నేతను కానీ, పోలీస్ అధికారిని కానీ అనడం లేదన్నాడు.
నాకొక నోటీస్ వచ్చింది.. నేను ఫలానా తారీఖు వస్తానని రిప్లై ఇచ్చా. షూటింగ్ వర్క్ కొనసాగుతుండటంతో నిర్మాతకు నష్టం రావొద్దని నేను మళ్లీ టైం అడిగా. ఈ కేసు ఏమైనా ఎమర్జెన్సీ కేసా ఏమైనా.. ఏడాది తర్వాత ట్వీట్ చూసిన అతనికి వారంలో అన్నీ అయిపోవాలనడంలో ఏమైనా అర్థం ఉంటదా అసలు.. హత్యకేసుల్లాంటి వాటికి సంవత్సరాలు తీసుకొని.. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసుల కంటే ముందే వీటిని విచారించడమేంటని తనదైన శైలిలో కౌంటర్ వేశాడు వర్మ. ఇంతకీ వర్మ ఈ వీడియోను ఎక్కడినుంచి పోస్ట్ చేశాడని నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు.
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!
Suriya 45 | సూర్య 45 పూజా సెర్మనీ టైం.. షూటింగ్ మొదలయ్యేది ఇక్కడే..!
Sritej | యువతి ఫిర్యాదు.. పుష్ప యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా