Suriya 45 | ఇటీవలే కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య (Suriya). ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన సూర్య.. తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య 44 (Suriya 44) చేస్తున్నాడు. మరోవైపు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45లో కూడా నటిస్తున్నాడు.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. ఆర్జే బాలాజీ (RJ Balaji) అండ్ టీం ఇవాళ పొల్లాచ్చిలో మాసాని అమ్మన్ టెంపుల్లో పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. అంతేకాదు రేపటి నుంచే షూటింగ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో కోయంబత్తూరు అగ్రికల్చర్ కాలేజీలో షూటింగ్ కోసం సెట్ వర్క్ పనులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన విజువల్స్, స్టిల్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో చెన్నై సుందరి త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సూర్య 45 స్క్రిప్ట్‌లోని కోర్ పాయింట్‌పై ప్రభావం పడకుండా సూర్య సార్ కోసం చాలా మార్పులు చేశామని.. సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశామని ఇప్పటికే ఆర్జే బాలాజీ ప్రకటించాడని తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సూర్య చేతిలో గొడ్డలి పట్టుకున్న ప్రీ లుక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. 24 సినిమా తర్వాత సూర్య, ఏఆర్ రెహమాన్ కాంబోలో వస్తున్న మరో సినిమా కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
#Suriya45 Pooja ♥️🔥🔥🔥 pic.twitter.com/mzjVRqTsHW
— Tiruttani Suriya Fort (@TiruttaniSfc) November 27, 2024
Sritej | యువతి ఫిర్యాదు.. పుష్ప యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!
Vetrimaaran | వెట్రిమారన్ డబుల్ ట్రీట్.. విడుదల పార్ట్ 2 ట్రైలర్, ఆడియో లాంచ్ టైం ఫిక్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా