Ram Gopal Varma | ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన వ్యవహారంలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో పోలీసులు రెండు సార్లు నోటీసులు అందించినా వర్మ విచారణకు హాజరుకాలేదు.
దీంతో వర్మ కోసం ఒంగోలు పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ నెల 23న కోయంబత్తూరులో షూటింగ్లో పాల్గొన్నట్టు తెలియజేస్తూ.. యాక్టర్లతో దిగిన ఫొటోలను ఎక్స్‌లో ట్వీట్ చేశాడు వర్మ. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు రాంగోపాల్ వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని వర్మ లీగల్ టీం పోలీసులకు తెలియజేసిన విషయం తెలిసిందే.
ఒంగోలు పోలీసులు మొదట హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి కూడా వెళ్లారు. అయితే వర్మ అక్కడ లేకపోవడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారని తెలిసిందే. వర్మ ఫోన్ స్విచాఫ్ వస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కాగా వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్ట్‌లో విచారణ జరుగనుంది.
వర్మ ట్వీట్స్ ఇలా..
At Coimbatore Airport ..I hope u din’t like my dress pic.twitter.com/BZm2kKm5ik
— Ram Gopal Varma (@RGVzoomin) November 23, 2024
Memories of COMPANY..Met the one and only @Mohanlal after a long long time 💐💐💐 pic.twitter.com/aUEvwwWDRg
— Ram Gopal Varma (@RGVzoomin) November 24, 2024
Devi Sri Prasad | ఎవరూ క్రెడిట్ ఇవ్వరు.. హాట్ టాపిక్‌గా పుష్ప నిర్మాతలపై డీఎస్పీ కామెంట్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా
Jr NTR | హిందీలో రెండో సినిమా.. ఆ అగ్రిమెంట్‌పై తారక్ సైన్ చేశాడా ఏంటీ..?
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్