Devi Sri Prasad | ఎవరూ క్రెడిట్ ఇవ్వరు.. హాట్ టాపిక్‌గా పుష్ప నిర్మాతలపై డీఎస్పీ కామెంట్స్
Devi Sri Prasad | సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కొన్ని కాంబోల్లో సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ రికార్డుల గురించే అంతటా చర్చ నడుస్తుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్-సుకుమార్-దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Devi Sri Prasad | సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కొన్ని కాంబోల్లో సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ రికార్డుల గురించే అంతటా చర్చ నడుస్తుంటుంది. అలాంటి జాబితాలో టాప్‌లో ఉంటుంది మైత్రీ మూవీ మేకర్స్-సుకుమార్-దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కాంబినేషన్. ఈ ముగ్గురి కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
అయితే పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) సినిమా విషయంలో మాత్రం వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని టాక్ నెట్టింట వినిపిస్తూనే ఉంది. దీనిక్కారణం ఈ సారి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో డీఎస్పీతోపాటు మరికొందరు సంగీత దర్శకులకు ఇవ్వడమనేది అంతటా నడుస్తున్న చర్చ. ఈ విషయం నిజమేనని పుష్ప 2 ది రూల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో మరోసారి తేలిపోయింది.
ఈవెంట్‌కు దేవి శ్రీ ప్రసాద్ కాస్త ఆలస్యంగా వచ్చాడు. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన నవీన్ యేర్నేని డీఎస్పీని అడిగారు. దీంతో స్టేజ్‌పైనే తన సహనాన్ని నవ్వుతూ బయటపెట్టేశాడు దేవీ శ్రీ ప్రసాద్. పాటలు లేటని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేటని తనను అంటూనే ఉంటారని,. ఇప్పుడు కూడా ఫంక్షన్‌కు ఆలస్యంగా వచ్చానని ఫీలయ్యారని, ఈ విషయంలో తననేం చేయమంటారని తనదైన స్టైల్లో చురకలంటించాడు డీఎస్పీ.
ఎవరూ క్రెడిట్ ఇవ్వరని, తీసుకోవాల్సిందేనని, అది పేమెంట్ అయినా, స్క్రీన్‌పై క్రెడిట్ అయినా తప్పదన్నాడు దేవీ శ్రీ ప్రసాద్. టైంకు పాట ఇవ్వలేదు.. టైంకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు. టైంకు ప్రోగ్రామ్ రాలేదని ఎక్కువ కంప్లైట్స్ చేస్తూ ఉన్నాయి. మీకు నా మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఉంటాయన్నాడు డీఎస్పీ.
పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలవుతున్న నేపథ్యంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి కాలేదని.. సుకుమార్ అండ్ టీం అదనంగా ఎస్ థమన్, అజనీష్ లోక్‌నాథ్, శ్యామ్ సీఎస్‌ను తీసుకోవడం డీఎస్పీకి నచ్చలేదని నెటిజన్లు, మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు. మరి సినిమా విడుదల నేపథ్యంలో ఎలాంటి ప్రభావం పడకుండా డీఎస్పీ, నిర్మాతలు రాజీకి వస్తారా..? అనేది చూడాలి.
Read Also :
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా
Jr NTR | హిందీలో రెండో సినిమా.. ఆ అగ్రిమెంట్‌పై తారక్ సైన్ చేశాడా ఏంటీ..?
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్
Amaran | ఫోన్ కాల్స్ ఎఫెక్ట్.. శివకార్తికేయన్ అమరన్ టీంకు విద్యార్థి లీగల్ నోటీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

