Vijay Antony | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నటుడిగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మల్టీటాలెంటెడ్ స్కిల్స్‌తో వినోదాన్ని అందిస్తున్న అతికొద్ది సెలబ్రిటీల్లో టాప్‌లో ఉంటాడు విజయ్ ఆంటోని (Vijay Antony). బిచ్చగాడు సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విజయ్ ఆంటోనీ గగన మార్గన్ (Gagana Maargan) సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడని తెలిసిందే.
లియో జాన్ పాల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం యూనిక్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే డిటెక్టివ్ ఫిక్షన్‌గా వస్తోంది. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్‌లో ముఖంపై గాట్లతో కొంచెం ఆందోళనగా ఉన్నట్టుగా కనిపిస్తున్న స్టిల్ ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సినిమా విలన్‌ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన లుక్స్ తో ఇంట్రెస్టింగ్ వార్తలను అందరితో షేర్ చేసుకున్నారు మేకర్స్.
ఈ మూవీతో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ ఆంటోనీ, అజయ్ ధీషన్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నాయని తాజా పోస్టర్లు చెప్పకనే చెబుతున్నాయి. మరి సిల్వర్ స్క్రీన్‌పై మామా అల్లుళ్ల ఫైట్ ఎలా ఉండబోతున్నది ఆసక్తికరంగా మారింది.
డెబ్యూ సినిమాతో అందరి ఫోకస్ తనవైపు తిప్పుకుంటున్నాడు అజయ్ ధీషన్. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా ఆంటోనీ నిర్మిస్తున్నారు.
#VijayAntony is introducing a new actor from his family. Meet @AJDhishan990 – The villain of #GaganaMaargan..😈💥🔥
@vijayantony | #VAFC12 pic.twitter.com/pifimDSX2C
— Tharani ᖇᵗк (@iam_Tharani) November 23, 2024
గగన మార్గన్ ఫస్ట్ లుక్..
The most-awaited gripping crime thriller #VAFC12 starring @vijayantony is titled #GaganaMaargan pic.twitter.com/bK08Bb1h33
— BA Raju’s Team (@baraju_SuperHit) October 16, 2024
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు