Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంపౌండ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాంఛైజీ ప్రాజెక్ట్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషనల్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది టీం. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
మరోవైపు కిస్సిక్ సాంగ్ ప్రోమోతో డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లిపోవం పక్కా అని అర్థమవుతోంది. తాజాగా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్ ఇస్తూ కొత్త లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్‌ను ఇవాళ రాత్రి 7:02 గంటలకు చెన్నై ఈవెంట్లో లైవ్ పర్ఫార్మెన్స్తో లాంచ్ చేయనున్నారు. శ్రీలీల, బన్నీ స్టైలిష్ కలర్‌ఫుల్ డ్యాన్స్‌తో థియేటర్లు షేక్ అవడం గ్యారంటీ అని తాజా పోస్టర్ చెప్పకనే చెబుతోంది.
ఫస్ట్ పార్ట్‌లో ఊ అంటావా సాంగ్ బాక్సాఫీస్‌ను ఏ రేంజ్లో షేక్ చేసిందో తెలిసిందే. మరి కిస్సిక్ కూడా అలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందా..? అనేది చూడాలి. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Icon Star @alluarjun & Dancing Queen @sreeleela14 will make you go KI⚡⚡IK with every move🔥#Kissik full song out today at 7:02 PM 💥💥
GRAND LAUNCH WITH A LIVE PERFORMANCE AT THE WILDFIRE EVENT IN CHENNAI 🔥🔥
A Rockstar @Thisisdsp‘s Musical Flash⚡⚡… pic.twitter.com/uoyPgcxE4e
— Pushpa (@PushpaMovie) November 24, 2024
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు