Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. టాలీవుడ్ టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ పాటలు కంపోజ్ చేస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ఎస్ థమన్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ క్రేజీ న్యూస్‌ను ఇప్పటికే అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది పవన్ కల్యాణ్ టీం. తాజాగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు పవన్ కల్యాణ్.
ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డబ్బింగ్ మొదలు పెట్టాడు. పవన్ కల్యాణ్ స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న స్టిల్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పవన్ కల్యాణ్‌తోపాటు డైరెక్టర్ హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ను కూడా చూడొచ్చు. మొత్తానికి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ టీం ఏదో అప్డేట్తో అభిమానులను ఖుషీ చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తోంది.
ఇప్పటికే విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్ కల్యాణ్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Power Star @PawanKalyan begins dubbing for #UstaadBhagatSingh ❤🔥
Post-production in full swing with Cult Captain @harish2you supervising it and @MusicThaman working to deliver a terrific score 💥
The surprise you have been waiting for will drop anytime today…stay tuned 🤩… pic.twitter.com/jHAggidTlV
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 7, 2026