Musi Victim | నువ్వు దిగేదాకా కష్టపడతాం.. సీఎం రేవంత్ రెడ్డికి మూసీ బాధితురాలి హెచ్చరిక
Musi Victim | రేవంత్ రెడ్డి అసలు మనిషేనా..? మనిషి జన్మ పుట్టలేదా..? రేవంత్ రెడ్డి కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు.. ప్రజల బాధ అర్థం చేసుకోవడం లేదని మూసీ బాధిత మహిళ మండిపడ్డది.
Musi Victim | ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే.. మాట్లాడుతుంటేనే బాధనిపిస్తుందని మూసీ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సదరు బాధితురాలు మాట్లాడుతూ.. మొన్న ఖమ్మంలో కూడా చూసినం.. ఒక్కొక్కొరైతే కాళ్లు పాయె, చేతులు పాయె అని ఏడిస్తే కూడా మనిషివేనా నువ్వు.. ప్రజల గురించి ఎందుకు ఆలోచించడం లేదు. ప్రజల బాధలు ఎందుకు అర్థం చేసుకుంటలేవు. నువ్వు అర్థం చేసుకునేదాక మా పోరాటం ఆగదని స్పష్టం చేసింది.
రేవంత్ రెడ్డి అసలు మనిషేనా..? మనిషి జన్మ పుట్టలేదా..? రేవంత్ రెడ్డి కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు.. ప్రజల బాధ అర్థం చేసుకోవడం లేదని మండిపడ్డది. బస్తీల మహిళలంతా ఏకమైతరు.. ఇప్పటికే రోడ్లపైకి వచ్చేసినం. ఇప్పుడు కూడా వస్తం.. ఇంకా రోడ్డుపై వచ్చి నువ్వు దిగేదాకా కష్టపడతాం. ఎందుకంటే మేము కూడా 30 ఏండ్ల నుంచి ఏగిస్తనే ఉన్నం. ఇవన్నీ తీసేస్తం.. అని చెప్తున్నరు. కానీ వాళ్లు కష్టం చేసిన కట్టుకున్న డబ్బులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇయ్యలే. వాళ్ల కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తమంటే ఎవరు ఊరుకుంటరు.
మా పైసలతోనే నువ్వు పెద్ద జీతం తింటున్నవ్. మా పైసలతోని ఇంట్ల ఉంటున్నవ్. నీకో 500 గజాల ఇల్లుంది.. నీ భార్య, బిడ్డ బతుకుతుంది. ఇయ్యాళ నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నవ్..అందరి కుటుంబాల గురించి ఎందుకు ఆలోచిస్తలేవు. ఆలోచించాలి.. లేకుంటే నువ్వు మళ్లా దిగుతవ్ బిడ్డా.. చూసుకో జాగ్రత్త అని హెచ్చరించింది.
రేవంత్ రెడ్డి అసలు మనిషేనా? మనిషి జన్మ పుట్టలేదా?
రేవంత్ రెడ్డి కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు.. ప్రజల బాధ అర్థం చేసుకోవడం లేదు
మహిళలందరం కలిసి రోడ్ల మీదకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ నుండు దిగిపోయేవరకు పోరాటం చేస్తాం – మూసీ బాధితురాలు pic.twitter.com/kPC1TyeJYG
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2026
Read Also :
ATM theft | అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ.. 1.60 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
Hyderabad | రెండో పెళ్లి చేసుకున్న హోంగార్డు.. విషయం బయటపడటంతో రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్‌కు!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

