Mechanic Rocky Twitter Review | టాలీవుడ్ యాక్టర్ విశ్వక్సేన్ (Vishwak Sen) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం మెకానిక్ రాకీ (Mechanic Rocky). మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. నరేశ్, వైవా హర్ష, హర్షవర్ధన్, రఘురామ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి తెరకెక్కించారు.
మనకు షేపవుట్ చేసుడే కాదు.. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసంటూ టైటిల్ రోల్లో ఎలివేట్ చేసే డైలాగ్స్‌తో సూపర్ హైప్ పెంచేసిన విశ్వక్ సేన్ మరి ప్రేక్షకుల అంచనాలు అందుకున్నాడా..? ఇంతకీ నెట్టింట మూవీ లవర్స్, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ సినిమా గురించి ఏమంటున్నారో ఓ లుక్కేస్తే..
#MechanicRocky Passable movie…..You can predict the play in 2nd half with in first 5 min. It could have been much more effective If handled by an experience director. Jakes Saripodha ki chesina duty lo 10% ivvala deeniki. Vishwak & Meenakshi 👍
— Chanu (@Temper1515) November 22, 2024
మొదటి 5 నిమిషాలతో సెకండాఫ్‌ను అంచనా వేయవచ్చు. ఈ చిత్రాన్ని అనుభవజ్ఞుడైన దర్శకుడు హ్యాండిల్ చేసి ఉంటే మరింత ప్రభావవంతంగా ఉండేది. జేక్స్ సరిపోదా శనివారం సినిమాకు చేసిన వర్క్‌లో పది శాతం దీనికి చేశాడు.
#MechanicRocky 💥🔥🔥
Present society lo cyber crimes gurinchi baga chupinchadu 🙌@VishwakSenActor did one man show in the film. Direction, writing, BGM, DOP work, and everything else are good. Second half plot change is unexpected 👍 Special mentions to the heroines… pic.twitter.com/OSL9kRckMl— కొమరం పులి (@SingleMan122) November 22, 2024
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్స్ గురించి బాగా చూపించాడు. విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షో. డైరెక్షన్, రైటింగ్, బీజీఎం, డీఎంపీ వర్క్‌తోపాటు మిగిలినవన్నీ బాగున్నాయి. సెకండాఫ్‌లో వచ్చే ఇన్వె్స్టిగేషన్ ఊహించనిది. హీరోయిన్లు మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
Movie ni miss avvakandi second half chala bagundhi twist matram 👌 mamulaga lev#MechanicRocky -3.5/5 👏 blockbuster second half
— Prince Anil ™ (@PrinceAnil_24) November 22, 2024
సినిమా మిస్సవద్దు. సెకండాఫ్ చాలా బాగుంది. ట్విస్టులు మాత్రం మామూలుగా లేవు. సెకండాఫ్ బ్లాక్ బస్టర్
#MechanicRockyReview
Below-Avg film. 1st half is dull, 2nd half slightly better but predictable. Core plot had potential but was overshadowed by unnecessary commercial elements.
Lagging scenes & weak screenplay make it missed opportunity.
Rating: 2/5#MechanicRocky #VishwakSen pic.twitter.com/gYgBeS6KwF— theindia.360🇮🇳 (@theindiaa360) November 22, 2024
యావరేజ్ కంటే తక్కువ స్థాయిలో ఉంది. ఫస్ట్ హాఫ్ డల్‌గా సాగుతుంది. సెకండాఫ్ బెటర్‌గా సాగుతూ.. అంచనా వేసేలా ఉంటుంది. కోర్ పాయింట్ బాగున్నా.. అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ దాన్ని కనిపించకుండా చేస్తాయి. సాగదీతలా కొన్ని సన్నివేశాలు. బలహీనమైన స్క్రీన్‌ప్లే.
#MechanicRockey #VishwakSen pic.twitter.com/BG0sfjTawL
— TollywoodBoxoffice.IN (@TBO_Updates) November 21, 2024
విశ్వక్ సేన్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్
శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి పాత్రలు
సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు
స్మార్ట్ స్క్రీన్ ప్లే
కొన్ని కామెడీ పంచ్‌లు
#MechanicRocky #MechanicRockey #Vijayawada lo 7:15 pm ki..Capital cinemas lo choosa.
Overall ga…
Cinema chala bagundi.Interval daaka…akkadakkada slow undi.
Concept ayithe bagundi.
Pakkagaa..
Eee weekend ki…ee Cinema choodachhu. Worth.— కథనంతో కట్టిపడేసేలాంటి సినిమాల అభిమాని (@oke_Okka_Chance) November 21, 2024
సినిమా చాలా బాగుంది. ఇంటర్వెల్ దాకా అక్కడక్కడా నెమ్మదిగా సాగుతుంది. కాన్సెప్ట్ బాగుంది. పక్కాగా ఈ వీకెండ్‌కు ఈ సినిమా చూడొచ్చు.
ఇప్పటివరకు విశ్వక్సేన్ కెరీర్లో బెస్ట్ వర్క్ మెకానిక్ రాకీ.
ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్‌గా సాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు బాగానే వర్కవుట్ అయ్యాయి. ఆన్లైన్ మోసాలపై వచ్చే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా సాగుతుంది. మొత్తానికి ఓపికగా సినిమాను భరిస్తే ఎంగేజింగ్‌గా సాగే చివరి గంటను మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఇంప్రెసివ్‌గా ఉంది.
Ram Charan | అయ్యప్పమాలలో దర్గాకు రాంచరణ్.. క్షమాపణ చెప్పాలని అయ్యప్ప భక్తుల డిమాండ్
Bhairavam | భైరవం షూటింగ్ టైం.. కోనసీమలో అదితీశంకర్తో బెల్లంకొండ శ్రీనివాస్
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు