Aishwarya Lekshmi | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని నటి ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi). పొన్నియన్ సెల్వన్‌లో సముద్రకుమారిగా కనిపించి తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. మట్టి కుస్తీతో కూడా ఎంటర్టైన్ చేసింది. ప్రొఫెషనల్‌గా బిజీగా ఉన్న ఈ భామ వ్యక్తిగత జీవితంలో పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని అందరితో షేర్ చేసుకుంది. ఐశ్వర్య లక్ష్మి నటుడు అర్జున్ దాస్‌తో కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. ఈ ఇద్దరు రిలేషన్షిప్ ఉన్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి.
అయితే ఈ భామ రిలేషన్‌షిప్‌పై స్పష్టత ఇస్తూ.. తాము కేవలం స్నేహితులమేనని చెప్పింది. అంతేకాదు పెళ్లి పట్ల వ్యక్తిగత అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ విషయమై ఐశ్వర్యలక్ష్మి మాట్లాడుతూ.. నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని చెప్పింది. నేను ఈ విషయాన్ని ఎక్కడైనా ఓపెన్‌గానే చెప్పాను. వివాహ వ్యవస్థపై నాకంత నమ్మకం లేదు. ఇది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. నా చిన్నతనంలో తాళి, తులసి మాలలతో పెళ్లి చేసుకోవాలనుకున్నానంది.
నా 34 ఏండ్ల వయస్సులో ఇప్పటికీ సంతోషంగా ఉన్న ఒక కుటుంబాన్ని మాత్రమే చూశాను. వాళ్లది మలయాళీ కుటుంబం కాదు. పెళ్లైన వారిలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఎదుగుదల లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. నేను ఎక్కువ జ్ఞానం సంపాదించినప్పుడు.. పెళ్లి నా జీవితంలో అవసరం లేదని అర్థం చేసుకున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఐశ్వర్యలక్ష్మి ప్రస్తుతం సాయిదుర్గతేజ్ నటిస్తోన్న SDT 18లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మరోవైపు తమిళంలో మణిరత్నం-కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న థగ్లైఫ్లో కీ రోల్ పోషిస్తోంది. దీంతోపాటు మలయాళంలో హలో మమ్మీ సినిమా చేస్తుండగా.. షూటింగ్ పూర్తి చేసుకుంది.
Sarangapani Jathakam teaser | మీరు ఊహించని అద్భుతం జరుగుతోంది.. ప్రియదర్శి సారంగపాణి జాతకం టీజర్
Bhairavam | భైరవం షూటింగ్ టైం.. కోనసీమలో అదితీశంకర్తో బెల్లంకొండ శ్రీనివాస్
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు