Sarangapani Jathakam teaser | టాలీవుడ్ యాక్టర్ ప్రియదర్శి (Priyadarshi) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం సారంగపాణి జాతకం (Sarangapani Jathakam). ఇంద్రగంటి మోహన కృష్ణ (Indraganti Mohana Krishna) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. రూపా కొడువయూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది నాన్న. ఈ రోజు మధ్యాహ్నం నువ్వు.. నేను సారంగపాణి.. దేవిక కొడుకుని అంటుండగా.. మీరు ఊహించని అద్భుతం జరుగుతోంది.. అంటూ సాగే డైలాగ్స్ సారంగ పాణి జాతకం, జీవితం చుట్టూ తిరిగే ఫన్నీ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతుందని చెప్పకనే చెబుతున్నాయి. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేక అతని చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే పరిపూర్ణ హాస్యరస కథాంశంతో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తున్నాడు ఇంద్రగంటి మోహన కృష్ణ.
సారంగపాణి జాతకం టీజర్..
Hilarious & Entertaining #SarangapaniJathakam Teaser Out Now !! @PriyadarshiPN #Priyadarshi pic.twitter.com/Jqt2fVEnS2
— BA Raju’s Team (@baraju_SuperHit) November 21, 2024
Bhairavam | భైరవం షూటింగ్ టైం.. కోనసీమలో అదితీశంకర్తో బెల్లంకొండ శ్రీనివాస్
UI The Movie | ఉపేంద్ర యూఐ తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు
Mammootty | మాలీవుడ్ మల్టీస్టారర్ కోసం శ్రీలంకలో మమ్ముట్టి, మోహన్ లాల్.. ఫొటోలు వైరల్
Theatre Reviews | ఇకపై థియేటర్ల ముందు రివ్యూలకు నో ఛాన్స్.. !