UI The Movie | కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘యూఐ’ (UI The Movie). ఉపేంద్ర కథనందిస్తూ.. డైరెక్ట్ చేస్తున్నాడు. రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటి పోషిస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ఆసక్తికర వార్తను షేర్ చేశారు మేకర్స్. యూఐ పంపిణీ హక్కులను పాపులర్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ అల్లు అరవింద్ సారథ్యంలోని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకుంది.
ఈ తుఫాను గతంలో ఎన్నడూ లేనంత పెద్దదిగా ఉండబోతుంది.. అంటూ షేర్ చేసిన తాజా వార్తతో సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. మనోహరన్-శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తు్న్న ఈ మూవీకి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఉపేంద్ర అశ్వంపై యుద్దవీరుడిలా కనిపిస్తున్న లుక్‌తోపాటు మేకింగ్‌లో హిస్టరీ.. సినిమాను మరోసారి పునర్నిర్వచించేందుకు డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని మరోసారి తెలియజేశారు.
ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన సౌండ్ ఆఫ్ యూఐ (Sound Of Ui) సినిమా ఎలాంటి థీమ్‌తో ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తూ .. క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ మూవీని లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్టైనర్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.
Breaking the limits of cinema! 🔥#AlluArvind garu proudly acquires the AP/TS rights for #UiTheMovie under #GeethaFilmDistributors 💥
This storm is about to be BIGGER than ever! ❤️🔥#UiTheMovieOnDEC20th#UppiDirects #Upendra @nimmaupendra #GManoharan @Laharifilm @enterrtainers… pic.twitter.com/fLoMmdOS4m
— BA Raju’s Team (@baraju_SuperHit) November 20, 2024
Mammootty | మాలీవుడ్ మల్టీస్టారర్ కోసం శ్రీలంకలో మమ్ముట్టి, మోహన్ లాల్.. ఫొటోలు వైరల్
Theatre Reviews | ఇకపై థియేటర్ల ముందు రివ్యూలకు నో ఛాన్స్.. !
AR Rahman: భార్య సైరాకు బ్రేకప్ చెప్పిన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్
Bacchala Malli | ఆ తేదీనే బచ్చలమల్లి.. అల్లరి నరేశ్ రిలీజ్ లుక్ వచ్చేసింది