Bacchala Malli | అల్లరి నరేశ్ (Allari Naresh) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ బచ్చలమల్లి (Bacchala Malli). సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రం క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా డిసెంబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
అల్లరి నరేశ్ సిగరెట్ తాగుతూ సీరియస్ మూడ్‌లో ఉన్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ముందుగా ఇదే తేదీన నాగచైతన్య నటిస్తో్న్న తండేల్ విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా వేస్తూ ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారని తెలిసిందే. మొత్తానికి తండేల్ తేదీన వస్తోన్న బచ్చలమల్లి సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. రాబోతున్న ఈ మూవీలో అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
హాస్యా మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుప్తా సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
బచ్చలమల్లి రిలీజ్ లుక్..
The most relatable yet hard-hitting #BachhalaMalli is all set to hit the big screens 💥
GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 20th ❤🔥@allarinaresh pic.twitter.com/d2d2Tj334X
— BA Raju’s Team (@baraju_SuperHit) November 19, 2024
RAPO 22 | సైకిల్ తోసుకుంటూ వెళ్తున్న రామ్ పోతినేని.. RAPO 22 ప్రీ లుక్ వైరల్
Pushpa 2 The Rule | పుష్ప 2 ది రూల్ రిలీజ్ ఆన్ ది వే.. తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్..!