మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జడ్చర్ల/జడ్చర్ల టౌన్, మార్చి 11 : తిమ్మిని బమ్మి చేసి.. అడ్డగోలు హా మీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరు ఉమ్మడి జిల్లాలో వివాదాస్పదంగా మారుతున్నా యి. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేలేక.. సమ స్యలు పరిష్కరించలేక.. సొంత సర్కారుపై ఉన్న అసహ నాన్ని ప్రజల మీదకు రుద్దుతున్నారు. గ్రామాల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి నిలదీసిన ప్రజలకు పెయిడ్ ఆర్టిస్టులంటూ ఎదురు తిరుగుతున్నా రు. ప్రభుత్వంపై.. ఎమ్మెల్యేలను నిలదీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా జిల్లాలోని ఓ ఎమ్మెల్యే నియో జకవర్గం అభివృద్ధిని గాలికి వదిలేసి అడ్డగోలు కా మెంట్లు చేస్తూ కమెడియన్లా మారిపోయారు.
తాజాగా ఇప్ప సారా దుకాణాలు తెరవాలని ఆయన చేసిన వ్యాఖ్య లపై సొంత నియోజకవర్గంలోనే మహిళలు మ ండిపడు తున్నారు. ఎమ్మెల్యే అయిండి ప్రజలకు మంచి చేయడా నికా లేక తాగుబోతులను చేయడానికా? అంటూ నిలదీ స్తున్నారు. రెండున్నర సంవత్సరాలు గడిచినా సొంత నియో జకవర్గంలో చేస్తానన్న అభివృద్ధి ఏమైందని జనం ప్రశ్నిస్తున్నారు. సారా దుకాణాలు తెరవాలని అ సెంబ్లీలో ప్రస్తావించడానికే మిమ్మల్ని ఎమ్మెల్యే చేశామా? అం టూ.. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత 2023లో కాలం కలిసి వచ్చి శాసన సభ్యుడిగా గెలుపొందారు.
లక్ష్మారెడ్డి హయాంలోనే ప్రగతి పరుగులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల నియో జకవర్గ కేంద్రం గుండెకాయ లాంటిది. ఈ నియోజక వర్గంలో ఫార్మా కంపెనీలకు నెలవుగా పోలేపల్లి సేజ్.. బాలనగర్, రాజాపూర్, మిడ్జిల్, ఊర్కొండ మండలాల పరిధిలో అనేక పారిశ్రామిక వాడలు జడ్చర్ల రూపురేఖ లనే మార్చి వేశాయి. జడ్చర్ల ప్రాంతం రియల్ ఎస్టేట్‌కు పెట్టింది పేరు. జాతీయ రహదారిపై ఉండడం వల్ల ఈ నియోజకవర్గ కేంద్రం అభివృద్ధిలో దూసు కుపోయింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాజీ మం త్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు తీసుకువచ్చి నియోజకవర్గం రూపురేఖలే మార్చివేశారు.
తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు చేపట్టిన అభివృద్ధి ఇప్పటికీ నియోజక వర్గానికి తలమాలికంగా నిలిచింది. జాతీయ రహదారిని అనుసంధానించడంతోపాటు అనేక బైపాస్ రోడ్లను ప్రతిపాదించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు జల భాండాగారంగా నిలు వనున్నది. ఇక్కడి అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ పనులు అన్నీ పూర్తయినప్పటికీ కేవలం రిజర్వాయర్ పనులను మాత్రం చేపట్టాల్సి ఉన్నది. అది కూడా దాదాపు 50 శాతం వరకు లక్ష్మారెడ్డి హయాంలోనే పూర్తి చేశారు. నవా బ్‌పేట, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్ మండలాల మీదుగా ప్రవహిస్తున్న పెద్దవాగుపై దాదాపు 27 చెక్ డ్యాములను కట్టించి రైతన్నలకు అండగా నిలిచారు. మరోవైపు కల్వ కుర్తి లిఫ్ట్ ఇరిగే షన్ ప్రధాన కాల్వ లు కూడా జడ్చర్ల మీదుగా కల్వకుర్తికి మళ్లించి వందలాది ఎకరాలకు సాగునీరిందించారు.
ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..!?
ఎన్నికల్లో జడ్చర్ల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచాక వాటిని అటకెక్కించారు. జడ్చర్ల పట్టణం నుంచి కల్వకుర్తి ప్రధాన రహదారికి అనుసంధానించే రోడ్డు రెండున్నర సంవత్సరాలైనా ఇప్పటి వరకు పూర్తి చేయించలేకపోయారు. దీంతో వాహనదారులు, ప్రజలు నిత్యం సిగ్నల్‌గడ్డ వద్ద అష్ట కష్టాలు పడుతున్నారు. జడ్చర్ల పట్టణ రూపురేఖలే మార్చి ఈ రహదారి నిర్మాణాన్ని పక్కకు పడేసి దీనిపై రాజకీ యాలు చేస్తున్నారు. కల్వకుర్తి రహదారి నుంచి బాలా నగర్ వరకు బైపాస్ రహదారి ప్రతిపాదిస్తే దాన్ని కూడా పూర్తి చేయించలేకపోయారు.
కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో చేసిన అభివృద్ధి తప్పా కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి ఒక్కటి కూడా జడ్చర్లలో కనిపించడం లేదు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్‌కు శంకు స్థాపన చేసి ఏడాది గడిచినా ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ తప్పా.. ప్రజలకు చేసేందేమీ లేదు. జ డ్చర్ల నియోజక వర్గం లో ఇసుక దందాకు తెరలేపి రూ.కోట్లు గడిస్తున్నారన్న ఆరో పణలు ఉన్నాయి న యాపైసా ప్రభుత్వ ఖ జానాకు కట్టకుండా ఇందిరమ్మ ఇండ్లు, అభివృద్ధి కార్యక్రమాలకు అంటూ దోపిడీకి తెరలేపారు. జడ్చర్లలో అతిపెద్ద మార్కెట్ ఉన్నప్పటికీ దాని గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.
ఉదండాపూర్పై రోజుకో మాట..
ఎన్నికల ముందు ఉదండాపూర్ రిజర్వాయర్ బాధితుల కు ఆర్అండ్ఆర్ ప్యాకేజీతోపాటు మెరుగైన పరిహారం అందిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేసుకొని గెలిచి.. నేడు మాత్రం అప్పుడు.. ఇప్పుడు.. అంటూ కాలయాపన చే స్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఉదండాపూర్ నిర్వాసి తుల వ్యవహారంపై అనేకసార్లు జడ్చర్ల ఎమ్మెల్యే ఇచ్చిన గడువులు, చేసిన హామీలు అన్నీ నీళ్లలో కొట్టుకు పోయా యి. ఉదండాపూర్ రిజర్వాయర్ కంప్లీట్ అయితే జడ్చర్లతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా కూడా సస్యశ్యా మలమయ్యే అవకాశం ఉన్నా..
కాంగ్రెస్ ప్రభుత్వం నయాపైసా కేటాయించడం లేదు.. దీనిపై ఎమ్మెల్యే సొం త అధికార పార్టీని నిలదీసిన దాఖలాలే లేవు. బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో జడ్చర్ల పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు కేటా యించడానికి చూస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్ల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారే తప్పా.. ఎక్కడా పూర్తి చేయించిన దాఖలాలు లేవని బీఆర్ఎస్ నేతలు విమ ర్శిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయలు తీసుకొచ్చామని ప్రగల్భాలు పలుకుతున్న ఎమ్మెల్యే.. మంత్రులతో శంకుస్థాపన చేయించడం తప్పా ఇంత వరకు ఒక్క పని కూడా ప్రారంభించ లేదన్న గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు..
1. బాలానగర్ నుంచి తిర్మలగిరి మీదుగా గంగాపూర్ వరకు డబుల్ లేన్ రోడ్డుకు హామీ ఇవ్వగా ఇప్పుడు ఆ రోడ్డు పనులు అసంపూర్తిగా సాగుతున్నాయి.
2. జడ్చర్లలో బైపాస్ రోడ్డు ఏమైందో..?
3. జడ్చర్లకు ఆర్టీసీ డిపో తెస్తానని.. పాత బస్టాండ్‌కు బస్సులు నడిచేలా చేస్తామన్నా.. సాధ్యం కాలేదు..
4. బాలానగర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనకే పరిమితమైంది.
5. జడ్చర్ల ఏరియా దవాఖానలో వంద పడకలకు సరిపడా సిబ్బంది తెస్తానని బిల్డప్ ఇచ్చినా ఇంత వరకు ఒక్క సిబ్బందిని నియమించలేదు.
6. ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.25 లక్షలు ప్యాకేజీ ఇప్పిస్తానన్న హామీ ఇచ్చినా నెరవేరలేదు..
7. నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అరికడతామని చెప్పి అడ్డగోలు దోపిడీకి తెర లేపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
8. నవాబ్‌పేటలోని కొల్లూర్‌లో నెలరోజుల్లో మండల కేంద్రం.. సబ్ స్టేషన్ స్థాయి హామీగానే మిగిలింది.
9. జడ్చర్లను రెవెన్యూ డివిజన్ చేస్తామన్న హామీపై అతీగతి లేదు.
10. నవాబ్‌పేటకు మినీ స్టేడియం చేస్తానన్న వాగ్దానానికే పరిమితమైంది.
11. తీగలపల్లి రోడ్డుపై బీటీ రోడ్డు కోసం 5 నెలల కిందట కొబ్బరి కాయ కొట్టినా పనులు ప్రారంబం కాలేదు.
12. గౌతాపూర్, పెద్దాయపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని ఎవరికీ కేటాయించలేదు.
13. నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నడుస్తున్నట్లు చెబితే రూ.10 వేల నగ దు బహుమతిగా ఇస్తానని చెప్పి వెనక్కి తగ్గారు.. అన్ని మండలాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపుల్లో ఇదే చర్చ కొనసాగు
తున్నది.
షాడో ఎమ్మెల్యేగా సోదరుడు..
జడ్చర్ల నియోజకవర్గంలో సొంత అన్న దుష్యంత్‌రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తీరిక లేకుండా నియోజకవర్గం రాకుండా ఉంటే సొంత అన్ననే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నారని పలువురు గుసగుసలాడడం వివాదాస్పదంగా మారింది. అనేకచోట్ల ఏ పదవిలేని సొంత అన్నను కార్యక్ర మాలకు పిలిచి ఆయనతో చేపించుకోండి.. అంటూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ దందా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్నది. చిన్నా చితక నేతలు భూములు కొనుగోలు, అమ్మకాల వ్యవహారంలో తలదూరిస్తే అన్నదమ్ములిద్దరూ బెదిరింపులకు గురి చేస్తున్నారని సమాచారం. ఏకంగా కాంగ్రెస్ రాజాపూర్ మండల అధ్యక్షుడు రాజీనామా చేసే వరకు వెళ్లింది. మరో కాంగ్రెస్ నేత భాస్కర్‌పై ఎమ్మెల్యే అనుచరులు కేసు పెట్టించడం కూడా కలకలం రేపింది. ఇన్ని జరుగుతున్నా అధిష్టానం మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావటం లేదని సదరు పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
ఫార్మా కంపెనీలే టార్గెట్‌గా..
జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి వద్ద ఫార్మ కంపెనీలను అధికార పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. దీనికి సపోర్ట్‌గా ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కూడా ఏకంగా కాలుష్యం వెదజల్లుతుందని నేపంతో ఆ ఫ్యాక్టరీని తగలబెడతానని హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ ఉన్న అనేక ఫార్మా కంపెనీలను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పారిశ్రామిక రంగాలకు చెందిన వ్యాపారవేత్తలకు ఆందోళన కలిగించాయి. అయితే ఆయా కంపెనీల నుంచి సీఎస్ఆర్ ఫండ్స్‌ను తమకు అనుకూలమైన వ్యక్తులకు ఇప్పించేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
సొంత పార్టీలో కుంపటి రాజేసి..
సాక్షాత్తు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే అసమ్మతి ఎమ్మెల్యేలను కూడగట్టుకొని క్యాంప్ రాజకీయాలకు తెరలేపడం అప్పట్లో సంచలనం సృష్టించింది. సుమారు పది మంది ఎమ్మెల్యేలను హోటల్లో సంప్రదింపులు ఏర్పాటు చేసి అసమ్మతి రాగం వినిపించారు. మంత్రులకు నిధులు ఇస్తున్నారని? ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదని? డ్రామా ప్లే చేశారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ కాగా ఈ పది మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. దీంతో నిధులు తేలేక.. సొంత సర్కారుపై అసహనం వెల్లగక్కుతూ నియోజకవర్గాలకు రాకుండా మొహం చాటేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే తాజాగా సొంత నియోజకవర్గంలో పోస్టుమార్గానికి తీసుకువెళ్లిన ఓ దళితుడి మృతదేహాన్ని కుక్కలు తినడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే ఇప్పటి వరకు బాధితులను పరామర్శించకపోవడం.. కనీసం దవాఖాన ఎలా ఉందో కూడా చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. మొత్తంపైన ఈ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ లీడర్‌కు తక్కువ.. కమెడియన్‌కు ఎక్కువ.. అన్నట్లు మారాయని నియోజకవర్గ ప్రజలే సెటైర్లు వేస్తున్నారు.