రాజన్న సిరిసిల్ల, జూలై 18: భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియా బీఆర్ఎస్ న్యూ సౌత్ వేల్స్ (BRS New South Wales, Australia) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను నేతలు కొనియాడారు. కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం.. పదేళ్లు మంత్రిగా కేటీఆర్ చేసిన కృషిని ఆయన పుట్టిన రోజును పునస్కరించుకొని బీఆర్ఎస్ న్యూ సౌత్ వేల్స్ ప్రతినిధులు కొనియాడారు. ప్రజల సంక్షేమం, యువతకు ప్రోత్సాహం, ఐటీ రంగ అభివృద్ధి, రాష్ట్ర ప్రగతికి పాటుపడిన కేటీఆర్‌కు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా బీఆర్ఎస్ న్యూ సౌత్ వేల్స్ సభ్యులు రాజేష్ గిరి, రాపోలు రవి శంకర్, దుపాటి
పరశురామ్, ముటుకుల్ల జస్వంత్, కొడెరపు శ్యామ్, గిలకతుల, శ్రీనివాస్ సుతారి, రాహుల్ రాంపల్లి, లక్ష్మణ్ నల్లాన్, వెంకట్ సాయి గుప్తా, నిఖిలేష్ బొందుగుల, రణధీర్ గిరి రెడ్డి, మహమ్మద్ ఇస్మాయిల్, రాజ్‌కుమార్ నర్మేటి, అమర్ రెడ్డి, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.