Khammam | ప్రభుత్వ ఆస్పత్రులపై కాంగ్రెస్ నిర్లక్ష్యం.. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడడం దారుణం..!
Khammam : ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రభుత్వాసుపత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
Khammam : ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రభుత్వాసుపత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన మందులు, సిరంజీలు, గ్లోవ్స్, ఇతర ప్రాథమిక వైద్య సామగ్రి కొరత ఉందనే వార్తలు వస్తున్నాయని పువ్వాడ తెలిపారు. సరైన సమయంలో వైద్యులు, నిపుణులైన స్పెషలిస్టులు, నర్సింగ్ సిబ్బంది లేక వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు, అవసరమైన సామగ్రి, సిబ్బంది కొరత కారణం రోగులు ఇబ్బందులు పడుతున్నారని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో రోగులు మరణిస్తున్నారని, ప్రజలు ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం దారుణమని మాజీ మంత్రి అన్నారు. వైద్య వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిలో మౌలిక వసతులను గణనీయంగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు పువ్వాడ. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, ఖమ్మం ప్రభుత్వాసుపత్రి గత వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

