Gautam Adani: గౌతమ్ అదానీపై నేరాభియోగాలు.. కేసు డిస్మిస్ చేసిన అమెరికా కోర్టు
Gautam Adani: అదానీ గ్రూపు చైర్మెన్ గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. లంచం కేసులో అదానీపై ఉన్న నేరాభియోగాలను అమెరికా కోర్టు డిస్మిస్ చేసింది. రెండేళ్ల క్రితం అమెరికాలో అదానీపై కేసు దాఖలైన విషయం తెలిసిందే. న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టు ఈ కేసును డిస్మిస్ చేసింది.
న్యూయార్క్: అదానీ గ్రూపు చైర్మెన్ గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. లంచం కేసులో అదానీపై ఉన్న నేరాభియోగాలను అమెరికా కోర్టు డిస్మిస్ చేసింది. రెండేళ్ల క్రితం అమెరికాలో అదానీపై కేసు దాఖలైన విషయం తెలిసిందే. న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టు ఈ కేసును డిస్మిస్ చేసింది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అదానీ గ్రీన్ సీఈవో వినీత్ జైన్‌పై ఉన్న కేసులను డిస్మిస్ చేస్తున్నట్లు కోర్టు చెప్పింది. న్యాయవాది నికోలస్ గారౌఫిస్ ఈ తీర్పును వెలువరించారు. ఈ కేసును డిస్మిస్ చేయడంతో.. అదానీపై నేరాభియోగాలు పర్మనెంట్‌గా కొట్టివేసినట్లు అవుతుంది. ఇదే రకమైన నేరాభియోగాలను మళ్లీ నమోదు చేయరాదు.
2024 నవంబర్‌లో గౌతమ్ అదానీపై క్రిమినల్ కేసు పెట్టారు. సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందేందుకు భారతీయ ప్రభుత్వ అధికారులకు సుమారు 250 మిలియన్ల డాలర్ల లంచం ఇచ్చినట్లు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపణలు చేశారు. సోలార్ పవర్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2 బిలియన్ల డాలర్లు ఆర్జించాలని అదానీ గ్రూపు భావించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమెరికా మార్కెట్లో బాండ్లు జారీ చేయడం ద్వారా సుమారు మూడు బిలియన్ల డాలర్లు ఆర్జించారని, దీంట్లో పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. కానీ అదానీ గ్రూపు ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు కొట్టిపారేసింది. నిరాధార ఆరోపణలు అని పేర్కొన్నది. చట్టాలు, నిబంధల ప్రకారమే వ్యవహరించినట్లు అదానీ గ్రూపు తెలిపింది.
తీర్పును స్వాగతించిన అదానీ
అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల గౌతమ్ అదానీ రియాక్ట్ అయ్యారు. కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. హుందాగా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, న్యాయ ప్రక్రియపై గాఢమైన గౌరవం ఉందన్నారు. ఈ సంకట కాలంలో సత్యంపై నమ్మకం, చట్టంపై విశ్వాసంతో ఉన్నట్లు చెప్పారు. ఎక్స్ అకౌంట్లో గౌతమ్ అదానీ స్పందించారు. తమపై నమ్మకంతో ఉన్నవారికి ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఏదేమైనా తమ పని తాము చేసుకుపోతామని, దేశ నిర్మాణం కోసం శ్రమిస్తామని, విలువలను క్రియేట్ చేస్తామని, బహుల ప్రయోజనాల కోసం పనిచేయనున్నట్లు చెప్పారు. అదే తమ కమిట్మెంట్ అన్నారు.
I welcome the US court’s decision with humility and deep respect for the judicial process.
Throughout this challenging period, our faith in truth, fairness and the rule of law remained unwavering.
My deepest gratitude to those who never lost faith in us, in the system and in…
— Gautam Adani (@gautam_adani) August 10, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

