Chennamma Deve Gowda | బ్రేకింగ్.. మాజీ ప్రధాని దేవెగౌడకు సతీవియోగం..!
Chennamma Deve Gowda : మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ సతీమణి చెన్నమ్మ దేవెగౌడ(Chennamma Deve Gowda) కన్నుమూశారు.
Chennamma Deve Gowda : మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ సతీమణి చెన్నమ్మ దేవెగౌడ(Chennamma Deve Gowda) కన్నుమూశారు. గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో ఆమె బెంగళూరులోని ఆస్పత్రిలో శనివారం మరణించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె 80 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దాంతో, దేవెగౌడ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు సతీవియోగం జరిగింది. ఆయన భార్య చెన్నమ్మ దేవెగౌడ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమెను జూలై 15, బుధవారం ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు.
‘శనివారం చెన్నమ్మ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. వైద్యులు ఆమెను బతికించేందుకు ఎంతగానో ప్రయత్నించినా లాభం లేకపోయింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు’ అని మణిపాల్ ఆస్పత్రి ఓ ప్రకటనలో తెలిపింది.
Former Prime Minister H.D. Deve Gowda’s wife, Chennamma, passed away due to illness at a private hospital in Bengaluru, Karnataka.
— ANI (@ANI) July 18, 2026
#WATCH | Karnataka: Mortal remains of Chennamma, wife of former Prime Minister H.D. Deve Gowda, being brought out of the private hospital in Bengaluru where she passed away due to illness. pic.twitter.com/E7xDoTHBsr
— ANI (@ANI) July 18, 2026
దేవెగౌడ, చెన్నమ్మల వివాహం 1954లో జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కమార్తెలు. కుమారులు హెచ్డీ కుమారస్వామి కేంద్ర మంత్రి కాగా, హెచ్డీ రేవన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. 2001 ఫిబ్రవరిలో జరిగిన కుటుంబ గొడవల సమయంలో చెన్నమ్మ యాసిడ్ దాడికి గురయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

