కోస్గి/ మద్దూర్ ; నమస్తే తెలంగాణ దినపత్రికపై అనుచిత, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ నారాయణపేట జిల్లా మద్దూర్, కోస్గి మండలాల ప్రెస్‌క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఆయా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదుచేశారు. వికారాబాద్ జిల్లా హకీంపేట్‌కు చెందిన కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డి, ఆయన అనుచరులు నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కొన్ని వార్తల విషయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు పత్రికలపై వ్యవహరించిన తీరు అత్యంత హేయమైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ సభ్యులు నారాయణరెడ్డి, షఫీ, పవన్‌కుమార్‌రెడ్డి, వెంకటేశ్, అతిక్, కమ్రుద్దీన్, రమణారెడ్డి, సల్మాన్‌రాజు, శంకర్, చైతన్యగౌడ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.