Rohit Sharma | లార్డ్స్ బాల్కనీలో గంభీర్, రోహిత్.. వీడియో..!
Rohit Sharma : ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ కోల్పోయిన భారత జట్టు వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. వీడ్కోలు వార్తలు వస్తున్న వేళ కోచింగ్ సిబ్బందితో రోహిత్ శర్మ(Rohit Sharma) సరదాగా కనిపించాడు.
Rohit Sharma : ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ కోల్పోయిన భారత జట్టు వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. రెండే వన్డేలో గెలిచి సిరీస్ సమం చేసిన ఆతిథ్య జట్టును ఓడించి పరువు కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. ఆదివారం మ్యాచ్ కోసం ఇప్పటికే శుభ్‌మన్ గిల్ సేన లార్డ్స్‌కు చేరుకోగా.. వీడ్కోలు వార్తలు వస్తున్న వేళ కోచింగ్ సిబ్బందితో రోహిత్ శర్మ(Rohit Sharma) సరదాగా కనిపించాడు. లార్డ్స్ బాల్కనీలో నవ్వుతూ.. గత విజయాలను గుర్తు చేసుకున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఫామ్ లేమితో బాధపడుతున్న రోహిత్ శర్మ కెరీర్ లార్డ్స్ వన్డేతో ముగియనుంది అనే ప్రచారానికి తెరపడినట్టే అనిపిస్తోంది. సోషల్ మీడియాలో, మాజీ ఆటగాళ్ల నుంచి రోహిత్‌కు మద్దతు లభించడం.. అనుభవజ్ఞుడైన అతడి సేవలు అవసరమేగా? అనుకున్నారో ఏమో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతే రోహిత్‌కు ఇది ఆఖరి మ్యాచ్ కాదని చెప్పాడు. సైకియా ప్రకటనతో హిట్‌మ్యాన్ వీడ్కోలు వాయిదా పడిందనే నమ్మకం అభిమానుల్లో బలపడింది. వచ్చే వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహాల్లో రోహిత్ భాగమేనని అనుకుంటున్నారంతా.
Gautam Gambhir and Rohit Sharma share a moment together at the Lord’s balcony. pic.twitter.com/BkLciNvXd7
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 18, 2026
ఈ నేపథ్యంలో ఆదివారం నిర్ణయాత్మక మూడో వన్డే కోసం శనివారమే భారత బృందం లార్డ్స్‌కు చేరుకుంది. కోచ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్లతో కలిసి హిట్‌మ్యాన్ లార్డ్స్ బాల్కనీలో కనిపించాడు. గౌతీ అప్పడలా జరిగింది అన్నట్టుగా ఏదో చెప్పగా.. అందరూ నవ్వారు. చూస్తుంటే.. అంతా సద్దుమణిగినట్టే అనిపిస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో(11, 26) విఫలమైన రోహిత్ .. మూడో వన్డేలో భారీ స్కోర్‌తో చెలరేగానులనుకుంటున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

