Actor Naresh : ఒక్కో ప్రాంతానికి ఒక్కో కల్చర్ ఉంటుందని, ఆ ప్రాంత సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సినీ నటుడు నరేష్ అన్నారు. అంతేతప్ప అపహస్యం చేసేలా మాట్లాడడం తగదని సూచించిన ఆయన తెలంగాణ అంటే తాగుడు.. ఆంధ్రా అంటే భోజనం కాదు అని స్పష్టం చేశారు. ఇటీవల ప్రియదర్శి, జానపద సంచలనం నాగదుర్గ జంటగా ప్రకటించిన ‘ఇడుపుకాయితం'(Idupu Kayitham) సినిమా టైటిల్ విషయంలో జరిగిన రాద్దాంతం చూసి తనకు చాలా బాధేసిందని పేర్కొన్నారు నరేష్.
సీనియర్ నటుడు నరేష్ మరోసారి తెలంగాణ భాష, సంస్కృతి పట్ల తన ఇష్టాన్ని తెలియజేశారు. మాండలికాలు వేరైనంత మాత్రాన అవమానకరంగా మాట్లాడం తప్పని ఆయన అన్నారు. మనం తీసేవి అన్ని తెలుగు సినిమాలే, విబేధాలు చేయడం సరికాదు అని నరేష్ హితవు పలికారు.
తెలంగాణ అంటే తాగుడు.. ఆంధ్రా అంటే భోజనం కాదు
ఒక్కో ప్రాంతానికి ఒక్కో కల్చర్ ఉంటుంది
ఇడుపు కాయితం సినిమా విషయంలో జరిగిన రాద్దాంతం చూసి బాధేసింది
మనం తీసేవి అన్ని తెలుగు సినిమాలే, విబేధాలు చేయడం సరికాదు
నేను తెలంగాణ మారుమూల ప్రాంతాలు తిరిగినప్పుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు… pic.twitter.com/eKAvn2CDWm
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2026
అంతేకాదు తాను తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో తిరిగినప్పుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చూసి ముచ్చటేసిందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా.. ఒకరు చనిపోయాక మూడో రోజు జరిగే కార్యక్రమం గురించి అక్కడి వాళ్ళు వివరించిన తీరు తెలంగాణ సంస్కృతిలో గొప్పదనాన్ని తెలియజేశాయని ఈ వెటరన్ నటుడు వివరించారు.