Commonwealth Games | బాక్సర్లు సాక్షి, ప్రియ గోల్డెన్ పంచ్.. జుడోలో ఉన్నాటి కంచుమోత..!
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా బాక్సర్లు వరసగా స్వర్ణ పతకాలతో మెరుస్తున్నారు.
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా బాక్సర్లు వరసగా స్వర్ణ పతకాలతో మెరుస్తున్నారు. పదోరోజు ప్రీతి పవార్ పసిడి పతకంతో శుభారంభమివ్వగా.. జాస్మినే లంబోరియా గోల్డ్ మెడల్‌తో సత్తా చాటింది. వీరిద్దరి విజయాలతో స్ఫూర్తి పొందిన సాక్షి చౌదరి(Sakshi Chaudhary), ప్రియా ఘంఘాస్ (Priya Ghanghas) సైతం పుత్తడి వెలుగులు విరజిమ్మారు. ఇప్పటివరకూ భారత్ గెలిచిన స్వర్ణాల సంఖ్య పదికి చేరింది. జుడోలో ఆశలు రేపిన ఉన్నాటి శర్మ కాంస్యంతో సరిపెట్టుకుంది.
గ్లాస్గోలో భారత బాక్సర్లు పతకాలతో పోడియం మీద మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు. పదో రోజుప్రీతి పవార్ పసిడి పతకం గెలిచిన వేళా విశేషం ఏంటోగానీ.. ఆతర్వాత వరసగా ఏకంగా మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మహిళల 54 కిలోల విభాగంలో ప్రీతి.. 57వ విభాగంలో రెచ్చిపోయిన జస్మినే సైతం స్వర్ణం పట్టేసింది. ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన మైఖేల్ వాల్ష్కు ఏమాత్రం అవకాశమివ్వని భారత బాక్సర్ 5-0తో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది.
ప్రీతి పవార్, జాస్మినే లంబోరియా

అనంతరం.. సాక్షి చౌదరీ సైతం గోల్డెన్ పంచ్ విసిరింది. 51 కిలోల ఫైనల్లో సివంగిలా చెలరేగిన సాక్షి .. ఇంగ్లండ్ ఛాంపియన్ రూబీని 5-0తో చిత్తుగా ఓడించింది. ఏకపక్ష పోరులో ప్రత్యర్థికి ఊపిరి సలపనివ్వని సాక్షి దేశానికి తొమ్మిదో పసిడి అందించింది. కాసేపటికే కజిన్ సాక్షిని అనుసరించిన ప్రియా ఘంఝాన్స్ కెనడా బాక్సర్ మ్యారీ బతౌల్ను మట్టికరిపించింది. 60 కిలోల విభాగంలో పంచ్‌ల వర్షం కురిపించిన ప్రియ మూడో రౌండ్ ముగిసేసరికి 4-1తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. దాంతో, భారత్ ఖాతాలో పదో స్వర్ణం చేరింది. మరోవైపు జుడోకా ఉన్నాటి శర్మ కాంస్యం సాధించింది. మొత్తంగా ఇప్పటివరకూ గ్లాస్గోలో భారత్ 33 పతకాలు గెలిచింది.
#Breaking – Priya won the gold medal in the women’s 60 kg boxing final at the Commonwealth Games Glasgow 2026. pic.twitter.com/ypiDqgnJTq
— NEWS WALA (@NEWSWALApy) August 1, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

