Anmog Geetanjali : సోనమ్ వాంగ్‌చుక్.. ఈ పేరు ఇప్పుడు భారతదేశమంతటా ప్రతిధ్వనిస్తోంది. లద్ధాఖ్‌కు రాష్ట్ర హోదా కోసం పోరాటంతో లోకమంతటికి తెలిసిన ఆయన .. ఈసారి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. సమస్య ఉన్నచోటల్లా వాలిపోయే సోనమ్ నిరుడు జాతీయ భద్రతా చట్టం(NSA) కింద జైలుకు కూడా వెళ్లారు. ఆ సమయంలో బాధ పడుతూ ఇంటిపట్టునే ఉండిపోలేదు అంగ్మో గీతాంజలి (Anmog Geetanjali). సుప్రీంకోర్టుక వెళ్లి.. రాష్ట్రపతి జోక్యం కోరి మరీ తన భర్తను జైలు నుంచి విడింపించారు. రేపటితరం కోసం నిస్వార్థంగా పోరాడుతున్న ఆయనకు జీవిత భాగస్వామిగానే కాదు ఉద్యమ సహచరిణిగానూ తోడ్పాటునందిస్తున్నారామె. ఏడాదిక్రితం ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ, పెళ్లి, పోరాటాల జీవితం గురించి గీతాంజలి పలు విషయాలు వెల్లడించారు.
పెళ్లితో కొత్త జీవితం మొదలవుతుందంటారు. కానీ, సోనమ్ వాంగ్చుక్ను మనువాడిన అంగ్మో గీతాంజలి మాత్రం సమస్యలే స్వాగతం పలికాయి. అలాఅనీ తనేమీ బాధపడడం లేదు. సమస్యలను ప్రశ్నించే.. పరిష్కారానికి ఉద్యమించే స్వభావం కలిగిన సోనమ్ బాటలోనే నేను నడుస్తానంటోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైలుకు వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్‌కు దన్నుగా నిలిచిన సునీతా కేజ్రివాల్(Sunita Kejriwal) మాదిరిగా.. ఇప్పుడు సోనమ్ ఉద్యమ సహచరిణిగా గీతాంజలి పేరు తెచ్చుకున్నారు.
Amidst Sonams deteriorating health, I mustered up courage to write this Op-ed for #thehindu as I want the whole nation, @dpradhanbjp, and @narendramodi to wake up to the crying need of a renewal and renaissance in #IndianEducationSystem. With thanks to the team at the Hindu!!… https://t.co/9HzJxgUaL8 pic.twitter.com/mTMHoTMfRh
— Gitanjali J Angmo (@GitanjaliAngmo) July 17, 2026
ఒడిశాలోని బలాసోర్లో పంజాబీ కుంటుంబంలో జన్మించిన అంగ్మో గీతాంజలి.. ఫక్రీ మోహన్ యూనివర్సిటీలో బ్యాజిలర్స్ ఫిజిక్స్ చదివారు. అనంతరం భువనేశ్వర్‌లోని గ్జావియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తి చేసిన ఆమె.. కార్పొరేట్ సంస్థల్లో, ఎక్కువగా డెన్మార్క్‌లో సేవలందించారు.
భారత్‌కు తిరిగొచ్చాక.. ఆంత్రోప్రెన్యూర్ అవతారమెత్తిన గీతాంజలి సొంత వ్యాపారం మొదలెట్టారు. పుషన్ అండ్ షాంఘై పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ను.. ఆపై హెలియోస్ బుక్స్‌ను స్థాపించారు. 2017లో భర్తతో కలిసి హిమాలయన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ (HIAL)ఓ ఇంటర్వ్యూలో ఆమె వాంగ్‌చుక్‌తో పెళ్లి, జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Gitanjali J. Angmo, wife of innovator and climate activist Sonam Wangchuk, Saturday said that no oral or IV treatment should be administered to her husband without the consent of his family and long-term doctors, following his admission to hospital after a 20-day hunger strike at… pic.twitter.com/rvPI3EG3uM
— Orissa POST Live (@OrissaPOSTLive) July 18, 2026
‘నా కంటే దేశానికి, సమాజానికి మేలు చేసే పనులు చేయాలని ఉండేది. చదువు, సమాజానికి మంచి చేయాలనే విషయంలో నాకు, సోనమ్ మధ్య చాలా పోలికలున్నాయి. ఆయనను చూడగానే నాలానే ఉన్నాడే అనిపించింది. మేము మొదటిసారి ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్‌లో కలిశాం. అభిప్రాయలు, మాటలు, వ్యక్తిత్వాలు.. కలవడంతో పెళ్లి చేసుకున్నాం’ అని గీతాంజలి తెలిపారు. సోనమ్‌కు గీతాంజలి రెండో భార్య. ఆమెకంటే ముందు అమెరికాకు చెందిన రెబెక్కా నార్మన్‌ను మనువాడారు సోనమ్. ఆమెకు విడాకుల అనంతరం గీతాంజలిని పెళ్లి చేసుకున్నారు.

గీతాంజలి ‘లింక్డ్ఇన్’ ప్రొఫైల్ ప్రకారం.. ఆమెకు కరాటేలో బ్లాక్‌బెల్ట్ ఉంది. అంతేనా.. సంప్రదాయ ఒడిస్సీతో రష్యా, బ్యాలెట్ డ్యాన్స్‌లూ వచ్చు. ప్రభుత్వం నుంచి ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డు కూడా అందుకున్నారు గీతాంజలి.
లాద్ధాఖ్కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్లతో ఉద్యమిస్తున్న ఆయనను సెప్టెంబర్‌లో జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసి జోధ్‌పూర్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పుటి వరకూ తన పనేదో తాను అన్నట్టుగా ఉండే గీతాంజలి ఉద్యమ బాట పట్టారు. జైలులో ఉన్న భర్తకు ధైర్యమిస్తూ..
సుప్రీంకోర్టును ఆశ్రయించారామె.
సోనమ్‌ను నెలల తరబడి జైల్లో ఉంచడాన్ని ఆమె సవాల్ చేయడమే కాదు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. ఆమె పట్టుదలకు ప్రభుత్వం దిగొచ్చింది. 170 రోజులకు సోనమ్ విడుదలవ్వడంతో.. ‘ఈ ఐదు నెలలుగా.. ప్రతివారం రెండుసార్లు కేవలం గంట సేపు మాత్రమే ఆయనతో మాట్లాడేందుకు వెళ్లేదాన్ని. ఎట్టకేలకు నా బాధకు తెరపడింది’ అని భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారామె.
Gitanjali J. Angmo, wife of climate activist Sonam Wangchuk, has urged that no medical treatment be administered without her consent after his admission to Safdarjung Hospital. She also questioned the circumstances surrounding his hospitalisation and sought greater transparency… pic.twitter.com/sZ0JdCprxd
— The Daily Jagran (@TheDailyJagran) July 18, 2026
నీట్ ఎగ్జామ్ లీకేజీపై భగ్గుమన్న సోనమ్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని పట్టుపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ(CJK)కి మద్దతుగా అమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28న దీక్షకు పూనుకున్నా గీతాంజలి మాత్రం దీక్షా స్థలికి రాలేదు. ఇంటిపట్టున ఉంటూనే ఆమె ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ పలు వార్త పత్రికల్లో ప్రత్యేక వ్యాసాలు రాశారు.
गीतान्जली जे. आंगमो का भावुक संदेश ❤️
पति का हौसला तब कई गुना बढ़ जाता है, जब उसकी पत्नी सिर्फ जीवनसाथी नहीं, बल्कि उसके सपनों की सबसे बड़ी ताकत, सबसे मज़बूत सहारा और हर संघर्ष में अटूट साथी बन जाए। 🌸✨ pic.twitter.com/9crqk46uWh
— Gen-Z of India (@GenZ_of_India_) July 17, 2026
అయితే.. భర్త ఆరోగ్యంపై వైద్యులు ఆందళోన వ్యక్తం చేయడంతో జూలై 17, శుక్రవారం వచ్చిన ఆమె.. దీక్ష విరమించాలని భర్తను కోరారు. అందుకు సోనమ్ ససేమిరా అనడంతో పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. దాంతో.. దీక్ష స్థలి నుంచి తన భర్తను బలవంతంగా తలరించాలని పేర్కొన్న గీతాంజలి.. ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశం మొదటి రోజైన జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరుకు ఛలో పార్లమెంట్లో పాల్గొంటామని గీతాంజలి తేల్చిచెప్పారు. ఎంతైనా.. భర్తకు తగ్గ భార్య కదా.. విద్యార్థిలోకానికి జరిగిన అన్యాయంపై అగ్గిబరాట అవకుండా ఉంటుందా..!