RAPO 22 | ఈ ఏడాది టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన డబుల్ఇస్మార్ట్ భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సారి రూటు మార్చి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం పీ మహేశ్ బాబు (Mahesh Babu P) డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాన్ని నవంబర్ 21న నిర్వహిస్తున్నట్టు తెలియజేస్తూ.. మూవీ లవర్స్ కోసం ప్రీ లుక్ విడుదల చేశారు మేకర్స్. తాజా..కొత్త.. ఇదివరకెన్నడూ చెప్పనిది.. అంటూ సైకిల్‌ను తోసుకుంటూ వెళ్తున్న స్టిల్ షేర్ చేశారు మేకర్స్. సూపర్ టాలెంటెడ్ మహేశ్ బాబుతో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశాడు రామ్.
కొంతకాలంగా యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ ఈ సారి మాత్రం ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే కథతో రాబోతున్నాడని అర్థమవుతోంది. ఇంతకీ రామ్ కోసం మహేశ్ బాబు ఎలాంటి కథ రెడీ చేశాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇంతకీ ఇందులో రామ్‌కు జోడీగా ఎవరు కనిపించబోతున్నారన్నది తెలియాల్సి ఉంది.
RAPO 22 ప్రీ లుక్..
Get ready to experience something Fresh..New..Untold.
Looking forward to working with the super talented @filmymahesh & @MythriOfficial #RAPO22 Begins. ❤️ pic.twitter.com/w7FDzj67sy
— RAm POthineni (@ramsayz) November 19, 2024
Pushpa 2 The Rule | పుష్ప 2 ది రూల్ రిలీజ్ ఆన్ ది వే.. తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్..!