Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంపౌండ్ నుంచి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాంచైజీ మూవీని 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం.
ఈ నేపథ్యంలో ప్రీక్వెల్ పుష్ప ది రైజ్ నవంబర్ 22న రీరిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఇస్తూ తెలుగు ప్రేక్షకులకు నిరాశ కలిగించే వార్త బయటకు వచ్చింది. రీరిలీజ్ కేవలం హిందీలో మాత్రం ఉండబోతుందట. ప్రస్తుతానికి తెలుగు వెర్షన్‌ను విడుదల చేసే ప్లాన్ ఏం లేదని ఫిలిం నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. సీక్వెల్‌కు ముందు ప్రీక్వెల్‌ను మరోసారి బిగ్ స్క్రీన్స్‌పై వీక్షించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఒరిజినల్ వెర్షన్‌ను కూడా రీరిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు మూవీ లవర్స్.
సీక్వెల్లో కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా సందడి చేయనుండగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Mr Bachchan | మిస్టర్ బచ్చన్ వచ్చేస్తున్నాడు.. రవితేజ మూవీ టీవీల్లోనైనా ఇంప్రెస్ చేసేనా..?
Kantara Chapter 1 | అఫీషియల్.. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 రిలీజ్ డేట్ వచ్చేసింది