Indian Air Force | 9న ఎయిర్‌ఫోర్స్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ..వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఈనెల 9న నిర్వహించనున్నట్టు వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
- వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఈనెల 9న నిర్వహించనున్నట్టు వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ, ఏపీకి చెందిన మహిళా, పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 9న గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీలో ఈ ర్యాలీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. 9,10 తేదీల్లో ఏపీ, తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థులకు, 12,13 తేదీల్లో ఏపీ పురుష అభ్యర్థులకు, 15,16 తేదీల్లో తెలంగాణకు చెందిన పురుష అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందని స్పష్టంచేశారు.
అభ్యర్థులు 2 జూలై 2005 నుంచి, 2 జనవరి 2009 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. కనీస ఎత్తు 152 సెం.మీలని, ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష, మూడేండ్ల డిప్లొమా ఇంజినీరింగ్ (పాలిటెక్నిక్), రెండేండ్ల ఒకేషనల్ కోర్సుల్లో (ఐటీఐ) ఉత్తీర్ణత సాధించినవారు అర్హులని పేర్కొన్నారు. ఆయా విద్యార్హతల్లో మొత్తం మారుల్లో 50 శాతం, ఆంగ్లంలో 50 శాతం మారులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షల్లో అర్హత సాధించిన వారికి రాత పరీక్ష ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం https:// agnipathvayu.cdac.inను సందర్శించాలని యాకుబ్ అలీ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

