Mr Bachchan | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటించిన చిత్రం మిస్టర్ బచ్చన్ (Mr Bachchan). హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహించాడు. భాగ్య శ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
కాగా ఓటీటీలో కూడా విడుదలైన మిస్టర్ బచ్చన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానుంది. ఈ చిత్రం నవంబర్ 24 ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్లో సందడి చేయనుంది. కొన్ని సినిమాలు థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ టీవీల్లో మాత్రం సూపర్ రేటింగ్ నమోదు చేశాయని తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి థియేటర్లు, ఓటీటీలో డీలా పడిపోయిన మిస్టర్ బచ్చన్ మరి టీవీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
మిస్టర్ బచ్చన్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.
World Television Premiere #MrBachchan Next Sunday at 6pm on #StarMaa#RaviTeja #BhagyashriBorse pic.twitter.com/MO9zhP8zht
— Telugu TV Updates (@telugutvupdts) November 17, 2024
Kannappa | మహదేవ్ శాస్త్రిగా మోహన్ బాబు.. కన్నప్ప ప్రీ లుక్ వైరల్
Pushpa 2 The Rule trailer | ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్
Kantara Chapter 1 | అఫీషియల్.. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 రిలీజ్ డేట్ వచ్చేసింది
Akira Nandan | ఓజీతోనే అకీరానందన్ ఎంట్రీ.. ఎస్ థమన్ క్లారిటీ ఇచ్చేసినట్టే..!