The Rana Daggubati Show | టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గు బాటి (Rana Daggubati) కాంపౌండ్ నుంచి టాక్ షో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ది రానా దగ్గుబాటి షో (The Rana Daggubati Show) ట్రైలర్‌ను విడుదల చేశారు. హాయ్.. నేను రానా దగ్గుబాటి.. అవును ఇది ఒక షో. కానీ మీరంతా ఈ షో దేని గురించి ఆశ్చర్యపోతున్నారు. నాకింకా ఏం తెలియదు.. అంటూ ఇంట్రో మొదలుపెట్టాడు రానా.
ఆ తర్వాత షోలోకి గెస్టులుగా నాగచైతన్య, శ్రీలీల, సిద్దు జొన్నలగడ్ఢ, నాని, ప్రియాంకా ఆరుళ్ మోహన్, ఎస్ఎస్ రాజమౌళి, తేజ సజ్జా దుల్కర్ సల్మాన్, రాంగోపాల్ వర్మ, మీనాక్షి చౌదరి, రిషబ్ శెట్టి లాంటి స్టా్ర్లు ఎంట్రీ ఇచ్చారు. స్టార్ సెలబ్రిటీలతో టాక్ షో ఉండబోతున్నట్టు రానా తెలియజేశాడు. రానా అండ్ సెలబ్రిటీల స్టైల్లో సాగే ఈ సిరీస్ నవంబర్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది.
ఫిల్టర్ చేయని, స్క్రిప్ట్ లేని.. మరిచిపోలేనిది.. అంటూ విడుదల చేసిన ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. రానా చేయబోయే షోలో రొటీన్ అంశాలే ఉండబోతున్నాయా.. ? లేదా ప్రేక్షకులకు కొత్త యాంగిల్ ఏమైనా చూపించడబోతున్నాడా..? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ది రానా దగ్గుబాటి షో ట్రైలర్..
Unfiltered, unscripted.. and unforgettable! 🤩#TheRanaDaggubatiShow Trailer out now ❤️🔥
— https://t.co/hdoCNRMPpa#TheRanaDaggubatiShowOnPrime, New Series, Nov 23@RanaDaggubati @SpiritMediaIN pic.twitter.com/qax4Mx7OqN
— BA Raju’s Team (@baraju_SuperHit) November 15, 2024
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట