Matka | టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మట్కా (Matka). పలాస 1978 ఫేం డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో నేడు గ్రాండ్‌గా విడుదల కాగా.. మిక్స్డ్ టాక్ రాబట్టుకుంది. కాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ ఆసక్తికర విషయం చెప్పి మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తు్న్నాడు.
నేను ముందుగా సాహో డైరెక్టర్ సుజిత్‌తో సినిమా చేయాలనుకున్నా. కానీ ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో తెరకెక్కిస్తున్న ఓజీ షూటింగ్‌తో ముడిపడి ఉంది. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టు వర్కవుట్ కానప్పటికీ సుజిత్ నాకు కథ చెప్పాడు. రాబోయే రోజుల్లో తాము మళ్లీ ఈ సినిమా చేసే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఓజీ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ సినిమా ఉండబోతుందని క్లారిటీ వచ్చేసినట్టైంది.
మట్కా చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ మూవీలో అజయ్ ఘోష్, బొమ్మాళి రవిశంకర్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. మట్కా వసూళ్లు ఎలా ఉండబోతున్నాయన్నది తెలియాల్సి ఉంది.
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట