SSMB 29 | ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందనే టాక్ మాత్రమే మొదట వినిపిస్తుంది. బాహబలి ప్రాంఛైజీ, ఆర్ఆర్ఆర్ తర్వాత అంతకు మించిన ట్రెండ్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29). మహేశ్ బాబు (MaheshBabu) లీడ్ రోల్లో రాబోతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ గ్లోబల్ అడ్వెంచరస్కు సంబంధించిన ఆసక్తికర వార్త సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ అదేంటనుకుంటున్నారా..? అదేనండి బడ్జెట్. ఎస్ఎస్ఎంబీ 29 రూ.1000 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Baradwaja) ఓ చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. అంతేకాదు భారీ స్థాయిలో ఉండబోతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు భాగం కాబోతున్నారని చెప్పారు. తమ్మారెడ్డి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండమే కాదు.. సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి.
మహేశ్‌బాబు ఈ సినిమా కోసం ఇప్పటికే మేకోవర్ మార్చుకుని.. లాంగ్ హెయిర్, గడ్డం, పోనీ టెయిల్ లుక్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడని తెలిసిందే. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.
Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేసిన పోలీసులు
Bhairavam | గజపతిగా మంచు మనోజ్.. ట్రెండింగ్‌లో భైరవం మాసీ లుక్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?