వరంగల్‌చౌరస్తా, ఫిబ్రవరి 26 : వరంగల్ ఎంజీఎం దవాఖాన అత్యవసర వార్డులో తక్షణ సేవలు అందడం లేదు. నిన్నా మొన్నటి వరకు వసతుల కరువు వెంటాడితే.., ఇప్పుడు సిబ్బంది కొరత వేధిస్తున్నది. తీరా అధికారులు స్పందించి వసతులు సమకూర్చే సమయానికి సిబ్బంది తొలగింపుతో సేవలు అందించే సిబ్బంది కరువయ్యా రు. అత్యవసర విభాగంలో పేషెంట్ కేర్ సిబ్బంది సేవలు అందుబాటులో లేకపోవడానికి సిబ్బంది తొలగింపే కారణమనే వాదనలు వినవస్తున్నాయి. ఇటీవల 300 ఓసీఎస్ విధానంలో పని చేస్తున్న 35మందిని విధుల నుంచి తొలగించారు.
వారిలో చాలామంది వార్డు బాయ్‌లుగా, పేషెంట్ కేర్ విధు లు నిర్వర్తించిన వారే కావడంతో ప్రస్తుతం ఈ సేవ లు అందించే సిబ్బంది కొరత ఏర్పడింది. ఎంజీఎంహెచ్ అత్యవసర విభాగం వద్ద విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అటెండెంట్లు, రోగులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అత్యవసర స్థితిలో ఉన్న రోగి ప్రా ణాలు కాపాడుకోవడానికి కుటుంబసభ్యులు 108 కు సమాచారం అందించి హాస్పిటల్‌కు చేరుకు న్నా.., రోగిని అంబులెన్స్ నుంచి వార్డుకు తరలించడానికి సిబ్బంది కరువయ్యారు. నిత్యం వందల సంఖ్యలో కేసులు అత్యవసర విభాగానికి వస్తూ ఉంటాయి.
వారిని స్ట్రెచర్లు, వీల్‌చైర్స్ ద్వారా క్యాజువాలిటీ విభాగంలోకి తీసుకువెళ్లడానికి వార్డు బా య్లు, పేషెంట్ కేర్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. అయితే, రోగిని, క్షతగాత్రుడిని తీసుకొని ఎంజీఎం హాస్పిటల్ చేరుకున్న 108 వాహ నం నుంచి వార్డుకు తరలించడానికి సిబ్బంది కరువవ్వడంతో కుటుంబసభ్యులు, 108 సిబ్బందే తరలించాల్సి వస్తుంది. ఈ కారణంతో మరో కేసు ను అటెండ్ చేయడానికి ఆలస్యమవుతుందని సిబ్బంది వాపోతున్నారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఇబ్బందులు కలుగకుండా తరలించడానికి నైపుణ్యం కలిగిన సిబ్బంది లేకపోవ డం, కుటుంబసభ్యులకు రోగులను తరలించే విషయంలో అనుభవలేమి కారణంగా అనారోగ్య స మస్యలు ఎదుర్కొంటున్న రోగులు తీవ్ర ఇబ్బందు లు పడాల్సి వస్తుంది.
300 ఓసీఎస్లో విధులు నిర్వహించిన సిబ్బందిని ప్రస్తుతం సేవలు అందిస్తున్న కాంట్రాక్టు సంస్థ ద్వారా అనుభవాన్ని దృష్టి లో ఉంచుకొని యథా స్థానాల్లో సేవలు అందించాలని వైద్యాధికారులు సూచించినా అందుకు కాం ట్రాక్టు సంస్థ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో రోగులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోగుల, క్షతగాత్రుల కష్టాలను తీర్చడానికి తగిన చర్యలు తీసుకొని సంబంధిత కాంట్రాక్టు సంస్థ ఆధ్వర్యంలో యథావిధిగా విధులు నిర్వహించుకొని వెసులుబాటు కల్పించాలని తొలగించబడిన సిబ్బంది కోరుతున్నారు.