KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు ఎర్రవెల్లిలోని నివాసం నుండి బయలుదేరి హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. కేసీఆర్ యశోద ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. పెద్ది కుటుంబసభ్యులకు కేసీఆర్ మనోధైర్యాన్ని అందించారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితోపాటు పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.
రెండు రోజుల క్రితమే యశోద హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న పెద్దికి ఆదివారం హనుమకొండలోని ఇంట్లో ఉదయం 7 గంటలకు తీవ్రమైన గుండెపోటు రాగా.. ఆయన భార్య స్వప్న వెంటనే దగ్గరలోని రోహిణి హాస్పిటల్కు తీసుకెళ్లారు. కార్డియాలజిస్ట్ మమతారెడ్డి నేతృత్వంలో వైద్యుల బృందం వేగంగా స్పందించి అత్యవసర వైద్యం అందించారు. అత్యవసర సీపీఆర్ అనంతరం మెరుగైన వైద్యం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డిని గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్లోని యశోద దవాఖానకు తరలించారని తెలిసిందే.
పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించడానికి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్ https://t.co/Y4nCC6L4eO pic.twitter.com/7UxHniIYkI
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్ https://t.co/xCJx4kQhKt pic.twitter.com/TQbN9KjvQA
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026
ఎర్రవెల్లి నివాసం నుండి యశోద హాస్పిటల్కు బయలుదేరిన కేసీఆర్
కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న కేసీఆర్ https://t.co/Il6BqGkUKu pic.twitter.com/sZH5geU9Xh
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026