CAT Admissions | మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) ప్రవేశాలకు సంబంధించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) నోటిఫికేషన్ విడుదలైంది. సీఏటీలో సాధించిన స్కోర్ ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM)లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (MBA/PGP), ఫెలో ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్మెంట్ (FPM/PhD)లో ప్రవేశం కల్పిస్తారు.
అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిజేబిలిటీస్ (PwBD) అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే చాలు. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు లేదా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఫెలో ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ ఆఫ్ ఇండియా (FIAI) వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసినవారు కూడా ఈ పరీక్ష రాయవచ్చు.
దరఖాస్తు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 3 నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతాయి. దరఖాస్తు ఫీజు రూ. 2700, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ. 1350 ఉంది. ఇతర వివరాలకు వెబ్సైట్ https://iimcat.ac.inను సందర్శించండి.
ప్రవేశం కల్పించే సంస్థలు
అహ్మదాబాద్, అమృత్సర్, బెంగళూరు, బోధ్‌గయ, కోల్‌కతా, గువాహటి, ఇండోర్, జమ్మూ కశ్మీర్, కోజికోడ్, లక్నో, ముంబై, నాగపూర్, రాయ్‌పూర్, రాంచి, రోహతక్, సంబల్పూర్, షిల్లాంగ్, సిర్మౌర్, తిరుచిరాపల్లి, ఉదయ్‌పూర్, విశాఖపట్నం వంటి 21 ఐఐఎంలు ప్రవేశాలు కల్పిస్తాయి. ఇందుకు దేశవ్యాప్తంగా 170 కేంద్రాల్లో ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు.