High Court | తెలంగాణ హైకోర్టు(High Court) సంచలన ఆదేశాలు జారీ చేసింది. వరుస వివాదాల నేపథ్యం లో హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను(Ranganath) తొలగించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించిం ది. అర్హత కలిగిన మరో అధికారిని నియామించాలని ఆదేశించింది. 63 కోర్టు ధిక్కరణలపై ఉన్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ని ఉల్లంఘలనకు పాల్పడుతున్న అధికారిని ఇంకా కొనసాగిస్తే రూల్ ఆఫ్ లా అదుపు తప్పుతుందని,రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని తెలిపింది.
కాగా, గతంలోను హైకోర్టు రంగనాథ్‌ను పద్ధతి మార్చుకోవాలని పలు మార్లు హెచ్చరించింది. కాగా, ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం వెనుక కారణమేమిటని నిలదీసింది. ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని లెకచేయకుండా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా? కోర్టు ధికరణనే పరిపాటిగా మార్చుకున్నారా? అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒకటి కాదు, రెండు కాదు, ఒకే అంశంపై మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలవుతున్నాయంటే కోర్టు ఉత్తర్వుల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతున్నదని ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టుల పట్ల ఎంత గౌరవం ఉన్నదో ఈ పరిణామాలే చెప్తున్నాయని పేరొంది. ఇకడ బాధితుడు పిటిషనర్ కాదని, స్వయంగా కోర్టేనని ధర్మాసనం స్పష్టం చేసింది.Food
కోర్టు ఉత్తర్వులను ధికరించడం ఎంతమాత్రం సహించబోమని రంగనాథ్‌కు తేల్చిచెప్పింది. ప్రభుత్వమైనా, ప్రభుత్వాధికారులైనా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేసింది. నీటి వనరులు, నాలాలు, కాలువల పరిరక్షణ పేరుతో కోర్టు ఉత్తర్వులను పకనపెట్టి ప్రైవేటు భూముల్లోకి వెళ్లడం ఏ చట్టం ప్రకారం సమర్థనీ యమని ప్రశ్నించింది. యజమాని అనుమతి లేకుండా ప్రైవేటు భూమిలో అడుగు పెట్టరాదన్న ప్రాథమిక సూత్రం తెలియదా అని నిలదీసింది. ప్రభుత్వ భూమిని రక్షించడమే లక్ష్యమైతే ప్రైవేటు వ్యక్తిపై పోలీసు ఫిర్యాదు ఎందుకు చేశారని ప్రశ్నించింది.