Matka | పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటిస్తోన్న చిత్రం మట్కా (Matka). పలాస 1978 ఫేం డైరెక్టర్ కరుణకుమార్ కాంపౌండ్ నుంచి వస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
మట్కా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సెన్సార్ అప్డేట్ వచ్చేసింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. టైటిల్స్‌తో కలిపి సినిమా పూర్తి నిడివి 2 గంటల 39 నిమిషాలు.
తాజా సమాచారం ప్రకారం మాస్ ఫీస్ట్‌లా సినిమా ఉండబోతుందట. వరుణ్ తేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్‌తో.. అద్భుతమైన స్క్రీన్ ప్రజెంటేషన్‌తో సాగేలా ఉండనుందని ఇన్సైడ్ టాక్. సహాయక పాత్రల్లో నటిస్తున్న మీనాక్షిచౌదరి, నోరా ఫతేహి పాత్రలు సినిమాపై ప్రభావం చూపించేలా సాగనున్నాయట. అజయ్ ఘోష్, బొమ్మాళి రవిశంకర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మట్కా యాక్షన్, ఎమోషన్స్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ల కలయికతో సాగే ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని ఇప్పటికే జీవి ప్రకాశ్ కుమార్ క్లారిటీ ఇచ్చేశాడని తెలిసిందే. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?
Akira Nandan | ప్రిపరేషన్ షురూ.. గ్రాండ్ ఎంట్రీ కోసం అకీరానందన్ ట్రైనింగ్.. !
krish jagarlamudi | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?