Akira Nandan | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కుమారుడు అకీరానందన్ (Akira Nandan) గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. సోషల్ మీడియాలో హ్యాండ్సమ్ లుక్‌లో కనిపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఇక సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడోనంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. తాజాగా దీనికి సంబంధించిన వార్త ఒకటి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తోపాటు మెగా అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
లేటెస్ట్ టాక్ ప్రకారం అకీరానందన్ పాపులర్ రైటర్, మెంటార్ సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకోబోతున్నాడట. గతంలో పవన్ కల్యాణ్, ప్రభాస్‌కు సత్యానంద్ మెంటార్‌గా వ్యవహరించాడని తెలిసిందే. వీళ్లిద్దరూ ఇప్పుడూ టాప్ స్టార్లుగా కొనసాగుతున్నారు. మరి అకీరా నందన్ కూడా రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో మంచి స్థాయికి చేరుకోవడం గ్యారంటీ అంటూ తెగ సంబరపడిపోతున్నారు అభిమానులు.
పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీతో అకీరా నందన్ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ ఉండబోతుందని వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి అకీరానందన్ ఎంట్రీ ఎప్పుడు, ఎలా ఉండబోతుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అకీరా నందన్ త్వరలో యాక్టింగ్ మొదలు పెడతాడని ఆశిస్తున్నా. అయితే నేను అతని నిర్ణయాన్ని, భావాలను గౌరవించాలి. అతడి జీవితం.. అకీరా ఏం కావాలనుకున్నా అతడి తల్లిగా వందశాతం సపోర్ట్ చేస్తానని రేణూదేశాయ్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
Krish | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?
Pushpa 2 Vs Chaava | పుష్పరాజ్ ఫీవర్.. అల్లు అర్జున్‌తో పోటీపై విక్కీ కౌశల్ వెనక్కి తగ్గాడా..?
Prithviraj Sukumaran | కరీనాకపూర్‌తో పృథ్విరాజ్ సుకుమారన్ రొమాన్స్..!
Thug Life | కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ రిలీజ్