Unstoppable With NBK S4 | టాలీవుడ్ హీరో బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable With NBK). ఎంటర్టైన్ మెంట్ డోస్ పెంచుతూ తాజాగా సీజన్ 4 కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ సీఎం నారాచంద్రబాబునాయుడుతో చేసిన ఫస్ట్ ఎపిసోడ్ సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకుంది.
ఆ తర్వాత మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గెస్టులుగా హాజరై.. బాలయ్యతో సరదా చిట్ చాట్‌తో వినోదాన్ని అందించారు. ఇక బాలకృష్ణతో సరదా సంభాషణ చేయబోయే కొత్త అతిథి ఎవరనే దానిపై ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
తాజా టాక్ ప్రకారం పాన్ ఇండియా స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కొత్త ఎపిసోడ్లో మెరవబోతున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. బన్నీ నటించిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణతో పుష్పరాజ్ ఫన్ టైం ఉండబోతుందని తెలుస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Thug Life | కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ రిలీజ్
Kanguva | ఇక హైదరాబాద్‌లో.. సూర్య కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం, వెన్యూ ఫిక్స్..!
Sai Pallavi | సాయి పల్లవి యాక్టింగ్ చూసి ఏడ్చేశా.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్