Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). సూర్య 42వ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి శివ (Siva) దర్శకత్వం వహిస్తున్నాడు. కంగువలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు.
కంగువ నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదలవుతుండగా.. సూర్య టీం ఇప్పటికే కోచి, చెన్నైలో గ్రాండ్‌గా ప్రమోషన్స్ నిర్వహించింది. తాజాగా తెలుగు ప్రమోషన్స్ టైం వచ్చేసింది. కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 7న పార్క్ హయత్‌లో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడీ స్టిల్ నెట్టింట క్యూరియాసిటీ పెంచేస్తుంది.
స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న కంగువ ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఈ మూవీని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుంది. ఓవర్సీస్ విషయానికొస్తే నార్త్ అమెరికాలో Prathyangira, యూకేలో యశ్ రాజ్ ఫిలిమ్స్ , సింగపూర్‌లో హోం స్క్రీన్, గల్ఫ్ దేశాల్లో Phars రిలీజ్ చేస్తున్నాయి.
Hyderabad… The moment we’ve been waiting for has arrived again. Join us for the Grand Pre-Release Event of #Kanguva! 🤩💥
🗓️ Nov 7th @ 6 PM
📍Park Hyatt, Hyd.Book Passes Here: 🎟️ https://t.co/bA6dEuIeie#KanguvaTour#KanguvaFromNov14 🗡️@Suriya_offl @thedeol @directorsiva… pic.twitter.com/ONkbxskxQE
— Kanguva (@KanguvaTheMovie) November 6, 2024
Thandel | నాగచైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ స్టిల్.. థియేటర్లలో తండేల్ సునామి వచ్చే తేదీ ఇదే..!
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్
Thalapathy 69 | బాక్సాఫీస్‌ను రూల్ చేయబోతున్న విజయ్-హెచ్ వినోథ్.. దళపతి 69 రైట్స్‌కు రికార్డ్ ధర