ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకనిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘ఆర్కే దీక్ష’. కిరణ్, అలేఖ్యరెడ్డి, ఆక్సఖాన్ ప్రధాన పాత్రధారులు. ఏప్రిల్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్కే గౌడ్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు వంద స్క్రీన్స్‌లో రిలీజ్ చేయబోతున్నాం.
దీక్ష, పట్టుదల ఉంటే జీవితంలో ఎలాంటి కార్యాన్నైనా సాధించవొచ్చనే సందేశాత్మక కథాశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పాటలకు మంచి పేరొచ్చింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు రోహిత్‌శర్మ, తులసి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, నిర్మాణ సంస్థ: ఆర్కే ఫిల్మ్స్, సిగ్ధ క్రియేషన్స్, దర్శకత్వం, నిర్మాణం: ఆర్కే గౌడ్.