Thandel | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం తండేల్ (Thandel). చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. అయితే ఆ తర్వాత విడుదల వాయిదా పడినట్టు వార్తలు తెరపైకి వచ్చాయి.
విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫైనల్‌గా అక్కినేని అభిమానులు ఊపిరిపీల్చుకునే సమయం వచ్చేసింది. తండేల్ ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రేమ తీరం నుండి భావోద్వేగాలతో నిండిన సముద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి.. అంటూ తీరపు అలల మధ్య సాయిపల్లవి, నాగచైతన్య ఎమోషనల్‌గా ఒకరికొకరు హగ్ చేసుకున్న స్టిల్‌ను షేర్ చేశారు. ఇప్పుడీ రిలీజ్ అప్డేట్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
తండేల్ రిలీజ్ డేట్ లుక్..
Get ready to sail from the shores of love to the ocean full of emotions ✨#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7TH, 2025 ❤️🔥#ThandelonFeb7th – https://t.co/KSkvscE3co #Dhullakotteyala 🔥🤙
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP… pic.twitter.com/TQBEOWLK1q
— Geetha Arts (@GeethaArts) November 5, 2024
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్