Amaran | కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Siva karthikeyan) నటించిన తాజా ప్రాజెక్ట్ అమరన్ (Amaran). మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ చిత్రంలో శివకార్తికేయన్ టైటిల్ రోల్లో నటించగా.. సాయిపల్లవి (Sai Pallavi) మేజర్ ముకుంద్ సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్ర పోషించింది. అమరన్ అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాగా.. మంచి టాక్ తెచ్చుకుంటోంది.
ఇప్పటికే అమరన్ టీంపై సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసలు కురిపించారు. తాజాగా మరో స్టార్ యాక్టర్ సూర్య-జ్యోతిక కపుల్, లెజెండరీ యాక్టర్ శివకుమార్ అండ్ అమరన్ టీంతో కలిసి సినిమాను వీక్షించారు. మంచి సినిమా అందించిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్, శివకార్తికేయన్ టీంకు అభినందనలు తెలియజేశారు. స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా దిగిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా మరోవైపు పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసిందని తెలిసిందే. SK21గా తెరకెక్కిన ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ చిత్రంలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు.
Thanks to @Suriya_offl Sir, #Jyothika ma’am and legendary actor #Sivakumar Sir for their presence and blessings for Team #Amaran! Their encouragement is a true inspiration as we share this story of bravery and love.!#AmaranMajorSuccess #MajorMukundVaradarajan #KamalHaasan… pic.twitter.com/4WRFBKNSCs
— Raaj Kamal Films International (@RKFI) November 5, 2024
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్
Nikhil Siddhartha | ప్రతీ పది నిమిషాలకో ట్విస్ట్.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాపై నిఖిల్
Thandel | డైలామాకు చెక్.. ఆ టైంలోనే నాగచైతన్య తండేల్ రిలీజ్..!