Thandel | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తోన్న తాజా చిత్రం తండేల్ (Thandel). రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించగా.. ఆ తర్వాత విడుదల వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
సంక్రాంతికి అయినా రిలీజవుతుందేమోనని ఎదురుచూస్తుండగా ఆ వార్తల్లో కూడా నిజం లేదని తేలిపోయింది. విడుదలపై నెలకొన్న డైలమాకు చెక్ పడినట్టు తాజా అప్డేట్ చెప్పకనే చెబుతోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి రెండో వారానికి ముందే విడుదల చేయాలని ఫిక్సయినట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. అయితే ముందుగా వచ్చినట్టుగానే తండేల్ వాలెంటైన్స్ డేన ప్రేక్షకుల ముందుకొస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రం నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే