SSMB 29 | తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన స్టార్ డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli ) . ఈ పాన్ ఇండియా దర్శకుడి కాంపౌండ్ నుంచి వచ్చిన బాహుబలి ప్రాంఛైజీ, ఆర్ఆర్ఆర్ ఏ రేంజ్లో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయో తెలిసిందే. ఈ రెండు సినిమాలను ఓవర్టేక్ చేస్తూ.. తన రికార్డును తానే అధిగమించే భారీ స్కెచ్ వేసుకొని మహేశ్ బాబు (MaheshBabu) హీరోగా ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29)తో ముందుకొస్తున్నాడు జక్కన్న.
వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది. గ్లోబల్ అడ్వెంచరస్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రాబోతుంది. రెండు పార్టులుగా తెరకెక్కనుంది. భారత అత్యంత ఖరీదైన సినిమాగా నిలువబోతుంది. జక్కన్న మహేశ్ బాబుతో ఎలాంటి సినిమాను ప్లాన్ చేస్తున్నాడో చెప్పేందుకు ఈ ఒక్క అప్డేట్ చాలు.
ఈ సినిమా కోసం మహేశ్‌బాబు ఇప్పటికే మేకోవర్ మార్చుకుని.. లాంగ్ హెయిర్, గడ్డం, పోనీ టెయిల్ లుక్‌లో కనిపిస్తుండగా.. ఈ ఫొటోలు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.
Superstar #MaheshBabu‘s globe trotting adventure film #SSMB29 to be made on a whopping ₹1️⃣0️⃣0️⃣0️⃣ cr budget.
India’s most expensive film to be directed by SS Rajamouli and will… pic.twitter.com/amq5gw04XN
— Manobala Vijayabalan (@ManobalaV) October 28, 2024
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?