Thandel | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రాజెక్ట్ తండేల్ (Thandel). చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న తండేల్‌లో సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ముందుగా ఈ మూవీని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారని తెలిసిందే.
అయితే ఆ తర్వాత తండేల్ విడుదల వాయిదా పడనుందంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. తండేల్‌ను రాంచరణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న గేమ్ ఛేంజర్‌తో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు కూడా టాక్ నడుస్తోంది. కాగా ఇప్పుడు తండేల్ టీం రెండు ఆప్షన్లు పెట్టుకుందన్న మరో అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సంక్రాంతికి గేమ్ ఛేంజర్, బాలకృష్ణ నటిస్తోన్న ఎన్బీకే 109, వెంకటేశ్-అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నారు సినిమాలు విడుదల కానున్నాయని తెలిసిందే. ఈ నేపథ్యంలో పోటీని దృష్టిలో పెట్టుకొని తండేల్ టీం రిపబ్లిక్ డే, వాలెంటైన్స్ డేను ఆప్షన్లుగా పెట్టుకున్నారని ఇన్సైడ్ టాక్. మరి ఇంతకీ తండేల్ ఎప్పుడు విడుదలవుతుందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోంది తండేల్. గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Game Changer Teaser | రాంచరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ టైం ఫిక్సయినట్టేనా..?
Sonam Kapoor | నీరవ్ మోదీ స్టోర్‌ను భారీ మొత్తానికి కొన్న సోనమ్ కపూర్