Game Changer Teaser | గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న గేమ్‌ఛేంజర్ (Game Changer). రాంచరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు సుందరి అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే జరగండి జరగండి, రా మచ్చా మచ్చా సాంగ్స్ విడుదలవగా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
రాంచరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ లాంచ్ టైం రానే వచ్చిందా.. అంటే నెట్టింట రౌండప్ చేస్తున్న కథనాలు అవుననే అంటున్నాయి. గేమ్ ఛేంజర్ టీజర్ టీజర్ అనౌన్స్మెంట్ ఈ వీకెండ్లో ఉండబోతుందన్న అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. శంకర్ అండ్ రాంచరణ్ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని 2024 డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రాబోతున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌లో కథానుగుణంగా రాంచరణ్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడట.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
War 2 | హృతిక్ రోషన్ వర్సెస్ తారక్ .. వార్ 2లో అదిరిపోయే కత్తిసాము సీక్వెన్స్