Prabhas | నేడు గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) బర్త్ డే సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు, కోస్టార్లు, అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసత్వాన్ని కొనసాగిస్తున్న ప్రభాస్‌కు బర్త్ డే విషెస్‌కు చెప్తూనే.. మరోవైపు పొట్టేల్ (Pottel) ప్రమోషన్స్ కూడా చేస్తుంది టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Anannya nagalla) టీం. పొట్టేల్‌ను తీసుకొని యువ చంద్ర, అనన్యనాగళ్ల, నోయెల్ కలిసి దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంటికెళ్లింది.
ఈ సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పొట్టేల్ సినిమా ఘనవిజయం సాధించాలని విష్ చేసింది. ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకునేలా పొట్టేల్ ప్రమోషన్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అనన్య నాగళ్ల (Anannya nagalla), యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం పొట్టేల్. ‘సవారీ’ ఫేం సాహిత్ మోత్ఖురి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం.
పొట్టేల్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బుజ్జి మేక (Bujji meka song) సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ మూవీలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్ఐఎస్ఏ ఎంటర్టైనర్మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
పొట్టేల్ టీం ప్రమోషన్స్ ఇలా..
రెబల్ స్టార్ ఆశీస్సులతో🙏
Rebel Star #KrishnamRaju garu’s wife #ShyamalaDevi garu, blesses the entire team and wishes for blockbuster success ❤️
Paid Premieres on Oct 23rd & 24th
🎟️ https://t.co/Yy0JucFHi4#POTTEL IN CINEMAS FROM OCTOBER 25th💥Nizam release by @MythriRelease… pic.twitter.com/znD0Mn3ipB
— BA Raju’s Team (@baraju_SuperHit) October 23, 2024
Suriya | కంగువ లాంటి సినిమా ఎవరూ చూడలేదు.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్