SS Rajamouli | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) కాంపౌండ్ నుంచి రాబోతున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29). బాహుబలి ప్రాంచైజీ, ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తెరకెక్కించిన ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
కాగా ఈ సినిమాను 2025లో సెట్స్‌పైకి తీసుకెళ్లనుండగా.. తాజాగా ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా కోసం తొలిసారి ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వినియోగించబోతున్నాడట. జక్కన్న సినిమా అంటే సాధారణంగా వీఎఫ్ఎక్స్ హైరేంజ్లో ఉంటుందని తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం ఏఐని భారీ స్థాయిలో వినియోగించాలని ఫిక్స్ అయ్యాడట. ఈ మేరకు ఏఐపై అవగాహన కోసం జక్కన్న ప్రత్యేక తరగతులకు కూడా హాజరవుతున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం.
సినిమాలోని కొన్ని పాత్రలు, జంతువులను సృష్టించేందుకు ఏఐ టెక్నాలజీని వాడబోతున్నాడని ఇన్‌సైడ్‌టాక్. మొత్తానికి ఇప్పటివరకు వీఎఫ్ఎక్స్తో మ్యాజిక్ చేసిన జక్కన్న ఈ సారి ఏఐతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో హాలీవుడ్ స్టార్‌తో వివిధ భాషలకు చెందిన నటీనటులు కనిపించబోతున్నారట. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. జక్కన్న టీం ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంది.
Suriya | కంగువ లాంటి సినిమా ఎవరూ చూడలేదు.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్